Site icon HashtagU Telugu

Uttam Kumar Reddy: మాలాంటి మాజీ సైనికుల సేవలు అవసరమని పిలుపు వస్తే.. నేను వెళ్లడానికి సిద్ధం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttamkumar Reddy

Uttamkumar Reddy

Uttam Kumar Reddy: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. అయితే, తాజాగా.. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను 16ఏళ్లకే ఆర్మీలోకి వెళ్లాను. 1982లో మిగ్-21 పైటర్ పైలెట్ గా పనిచేశా. ఆ తరువాత మిగ్-23 అత్యాధునిక పైటర్ కు పనిచేశా. శబ్ద వేగానికి 2.5 రెట్లు ఎక్కువ వేగంతో మిగ్-23 ప్లయింగ్ అవుతుంది. శ్రీనగర్, అమృత్ సర్ ప్రాంతాల్లో పనిచేశా. చాలా చిన్న వయస్సులో 20ఏళ్లకే పైటర్ పైలెట్ గా పనిచేశానని అన్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ మాలాంటి మాజీ సైనికుల సేవలు అవసరమని పిలుపు వస్తే నేను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్ చెప్పారు.

Also Read: India Pakistan War: ఆస్పత్రుల భవనాలపై ‘రెడ్ క్రాస్’ సింబల్స్ పెయింటింగ్ ఎందుకు వేస్తున్నారు..? జెనీవా ఒప్పందంలో ఏముంది..?

ఏప్రిల్ 22న పాకిస్తాన్ ప్రేరేపిత చర్య చాలా దుర్మార్గం. మతం పేరు అడిగి చంపడం దారుణం. ఈ ఘటనపై కశ్మీర్ తో సహా దేశమంతా ఏకతాటిపైకి వచ్చి ఖండించారు. టీఆర్ఎఫ్ (TRF) అనేది లస్కరే తోహిబాకు అనుబంధ సంస్థ. పాకిస్థాన్ నిర్వాకానికి బుధ్ది చెప్పడం సరైన చర్య. ఆపరేషన్ సిందూర్ లో రాఫెల్ యుద్ధ విమానాలు, కామికసేన్ డ్రోన్ లు పనిచేశాయి. భారత్ బోర్డర్ నుంచే రాఫెల్ యుద్ధ విమానాలు పనిచేశాయని ఉత్తమ్ అన్నారు. పాక్ చెబుతున్నట్లు రాఫెల్ విమానాలు కూల్చివేశామనడం అబద్ధం. ఎందుకంటే రాఫెల్ భారత్ బోర్డర్ కూడా దాటలేదు.

 

పాకిస్థాన్ ఇప్పుడు విచిత్రమైన పరిస్థితిలో ఉంది. పాకిస్థాన్ లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. పాకిస్థాన్ సృష్టించిన ఉగ్రవాదులే ఆ దేశానికి ప్రాణసంటకంగా మారిందని ఉత్తమ్ అన్నారు. యుద్ధం చేయడం భారత్ ఉద్దేశం కాదు. కేవలం టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే సైన్యం కొట్టేసింది. పాకిస్థాన్ దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పేరుకు ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ పాకిస్థాన్ ఆర్మీ మాత్రమే పాకిస్థాన్ ను నడిపిస్తుంది. కశ్మీర్ విషయంలో ఒక చర్య జరిగితే తప్ప రెండు దేశాల మధ్య సమస్య పరిష్కారం కాదు . పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఇండియాపరం చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం అని ఉత్తమ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ జమ్మూపై చేసిన దాడికి ఇండియన్ ఆర్మీ ప్రతిదాడి చేయడం సరైన చర్య. యుద్ధం కొనసాగితే పాకిస్థాన్ పతనం అవుతుంది. మూడో దేశం ఏదీ కూడా యుద్ధం చేయడానికి ముందుకు రాకపోవచ్చునని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు.