Talasani Babu Tho Nenu : ‘బాబుతో నేను’ దీక్షకు సంఘీభావం తెలిపిన బిఆర్ఎస్ మంత్రి తలసాని

మంత్రి తలసాని టీడీపీ దీక్షా శిబిరానికి విచ్చేసి 'బాబుతో నేను' పేరిట చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు. దీక్షలో కూర్చున్న టీడీపీ మద్దతుదారులను పలకరించారు.

Published By: HashtagU Telugu Desk
Talasani Srinivas Yadav sensational comments on Nandi Awards

Talasani Srinivas Yadav sensational comments on Nandi Awards

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu) ను ఖండించిన బిఆర్ఎస్ మంత్రి తలసాని (Minister Talasani Srinivas Yadav)..మరోసారి ‘బాబుతో నేను’ దీక్ష (Babu Tho Nenu Deeksha)కు సంఘీభావం తెలిపి టీడీపీ శ్రేణుల్లో ఆనందం నింపారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత నెల రోజులుగా ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. బాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు నిరసనలను , ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. అలాగే పలు రాజకీయ పార్టీ నేతలు సైతం చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ..సంఘీభావం తెలుపుతున్నారు.

ఇక హైదరాబాద్ లో పెద్ద ఎత్తుగా ఆంధ్ర సెటిలర్స్ ఉన్న సంగతి తెలిసిందే. వీరంతా కూడా బాబు అరెస్ట్ ను ఖండిస్తూ…నిరసనలు , ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో నేడు సనత్ నగర్ లో టీడీపీ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో.. మంత్రి తలసాని టీడీపీ దీక్షా శిబిరానికి విచ్చేసి ‘బాబుతో నేను’ పేరిట చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు. దీక్షలో కూర్చున్న టీడీపీ మద్దతుదారులను పలకరించారు. దీక్ష కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తలసాని రాకతో టీడీపీ దీక్షా శిబిరం వద్ద కోలాహలం నెలకొంది. కొంతసేపు అక్కడే ఉన్న ఆయన అనంతరం తిరిగి వెళ్లారు.

We’re now on WhatsApp. Click to Join.

మూడు రోజుల క్రితం కూడా తలసాని బాబు అరెస్ట్ ను ఖండిస్తూ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో మంత్రిగా పని చేశాను. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలగచేసింది. అధికారం శాశ్వతం కాదు. ఒకప్పుడు కేంద్ర రాజకీయాలల్లో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం. సుమారు 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు’’ అని పేర్కొన్నారు.

Read Also : KTR: ఈ నెల 9న తొర్రూరులో కెటిఆర్ స‌భ‌కు భారీ ఏర్పాట్లు

  Last Updated: 07 Oct 2023, 06:13 PM IST