యాదాద్రి ఆలయం(Yadadri Temple)లో మంత్రి కొండాసురేఖ (Minister Konda Surekha) కు చేదు అనుభవం ఎదురైంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ మంత్రి తోపులాటలో ఇరుక్కుపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన పుట్టిన రోజు సందర్బంగా సీఎం రేవంత్ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు.
ఉదయం హెలికాప్టర్ లో బేగం పేట నుండి కుటుంబ సభ్యులతో బయలుదేరిన రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం యాదాద్రికిచేరుకున్నారు. యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మంత్రులతో పాటు అధికారులు కూడా ఉన్నారు.నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులందరూ యాదాద్రికి చేరుకుని ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
కాగా సీఎంయాదాద్రి పర్యటన సందర్భంగా పెద్దఎత్తు ఆయన అభిమానులు, కార్యకర్తలు అక్కడకు చేరుకొని, సీఎంను చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో తూర్పు గోపురం వద్ద పోలీసులు – కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అదే సమయంలో మంత్రి కొండా సురేఖ కూడా తూర్పుగోపురం వద్దకు వచ్చారు. అంతలోనే తోపులాట చోటు చేసుకోవడంతో మంత్రి కూడా అందులో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ముందుకు వెళ్లలేక, వెనక్కి వెళ్లలేక తోపులోటలో కాసేపు మంత్రి విలవిలలాడి పోయారు. చివరకు ఎలాగోలా పోలీసులు.. మంత్రి కొండా సురేఖను అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చారు. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ..మరోసారి సురేఖ ను వార్తల్లో నిలిచేలా చేస్తున్నాయి. ఇటీవల సురేఖ కు టైం ఏమాత్రం కలిసిరావడం లేదు. ఏంచేసినా అది వివాదంగానే మారుతుంది. మొన్నటివరకు నాగార్జున , కేటీఆర్ లతో వివాదం నడిచింది. ఇది ఏ రేంజ్ లో నడిచిందో చెప్పాల్సిన పనిలేదు.
Read Also : Encounter : బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం