Site icon HashtagU Telugu

BRS MLAs: అసెంబ్లీ నుంచి శ్రీనివాస్ గౌడ్ అవుట్?

BRS MLAs

New Web Story Copy 2023 08 12t145633.304

BRS MLAs: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బండారం ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల ఆవిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు అతని ఎమ్మెల్యే పదవిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆయనకు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన ఎన్నికల అఫిడవిట్‌ను ట్యాంపరింగ్ చేసినందుకు మహబూబ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది నుంచి ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పులు దొర్లిందన్న ఆరోపణలపై ప్రత్యేక కోర్టు ఆయనపై దావా వేయాలని ఆదేశించింది. ఈ విషయంలో పోలీసులు చొరవ తీసుకోకపోవడంతో కోర్టు పోలీసులపై మండిపడింది. గత ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ మూడు వేర్వేరు అఫిడవిట్‌లను సమర్పించారని ఆరోపిస్తూ పిటిషనర్ చలువగాలి రాఘవేంద్రరాజు గతంలో ఫిర్యాదు చేశారు: నవంబర్ 14, మరొకటి నవంబర్ 19న, మూడవ అఫిడవిట్ తేదీ రహస్యంగా ఉంచారు.

ఈ మేరకు మాజీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్, మహబూబ్‌నగర్ జిల్లాల మాజీ కలెక్టర్లు రోనాల్డ్ రోస్, ఎస్ వెంకటరావు, ఆర్డీఓ శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ పద్మశ్రీ, వెంకటేష్ గౌడ్, నోటరీ అడ్వకేట్ రాజేంద్రప్రసాద్, దానం సుధాకర్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మహబూబ్‌నగర్‌లోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ పద్మావతి కాలనీ బ్రాంచ్‌లో రూ. 12 లక్షల తనఖా రుణం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Also Read: Harish Rao: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే: మంత్రి హరీశ్ రావు