Minister Sridhar Babu: తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ (Minister Sridhar Babu) అవుతారనే వార్త గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఘటనలో కేటీఆర్ ఉన్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులే అంటున్నారన్నారు. పదే పదే అరెస్టు మాట కేటీఆర్ సింపతీ కోసమే తెస్తున్నాడని మంత్రి ఆరోపించారు. కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి మేము ఏమి కుట్ర చేయడం లేదని తెలిపారు సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తి అయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు రైతుల దగ్గర మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో ఆర్ధిక వ్యవస్థను ఇష్టానుసారంగా, అస్తవ్యవస్తంగా చేసి వదిలిపెట్టారని ఆరోపణలు చేశారు. హరీష్ రావు రైతుల దగ్గర ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదని సూచించారు. ఆర్ధికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సన్న వడ్లకు 500 బోనస్ తో రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేస్తామని తెలిఆపరు. ధాన్యం సేకరించిన 5, 6 రోజుల వ్యవధిలోనే సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. భేషజాలకు పోకుండా రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని, బీఆర్ఎస్ సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు.
Also Read: Maharashtra Elections 2024: పవన్ కళ్యాణ్ కు బీజేపీ కీలక బాధ్యతలు.. రోడ్ మ్యాప్ ఇదే!
బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చ గొడుతున్నారని, గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం ఎక్కువగా పండింది అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లతో సంబంధం లేకుండానే 16.77 లక్షల ఎకరాల్లో 155 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని తెలిపారు. భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా ధాన్యం పండిందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం 17 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తుందని, తేమ శాతం పెంచాలని కేంద్రంపై కిషన్ రెడ్డి ఒత్తిడి తేవాలన్నారు.
లగచర్లకు ఎవరు వచ్చిన దాడులు చేయాలని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులపైన దాడులు చేయమని చెప్పింది ఎవరో వీడియోలో ఉందన్నారు. కలెక్టర్, కడా ఛైర్మన్‌ను చంపే ప్రయత్నం చేశారు. పరిశ్రమ అనేది రాష్ట్ర ప్రగతీలో ఒక చిహ్నమని బీఆర్ఎస్ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు.