Site icon HashtagU Telugu

BuildNow Launched : హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్

Launched Buildnow

Launched Buildnow

మొన్నటి వరకు హైడ్రా (Hydraa) తో భయపెట్టిన కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ఇప్పుడు నగరవాసులకు గుడ్ న్యూస్ తెలిపి ఊపిరి పీల్చుకునేలా చేసారు. నూతన భవనాలు, లేఔట్ ల కోసం బిల్డ్ నౌ వ్యవస్థను (BuildNow Launched) ప్రవేశ పెడుతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తెలిపారు.

హైదరాబాద్ నగర అభివృద్ధికి మరో ముందడుగుగా బిల్డ్ నౌ (BuildNow ) వ్యవస్థను మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ కొత్త వ్యవస్థ ద్వారా భవనాలు, లేఔట్లు నిర్మాణానికి (Online Building and Layout Approval System) సంబంధించిన అనుమతులు త్వరితగతిన అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. సాధారణంగా అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని తగ్గించే ఈ సాంకేతిక పరిజ్ఞానం, ఐదు నిమిషాల్లో అనుమతులు పొందేలా డిజైన్ చేయబడినట్లు పేర్కొన్నారు.

3D టెక్నాలజీతో వేగవంతమైన ప్రక్రియ ::

ఈ వ్యవస్థలో 3D టెక్నాలజీని వినియోగించి భవన నిర్మాణ అనుమతులను మంజూరు చేయడం జరుగుతుంది. దీంతో అనుమతి ప్రక్రియలో రోజులు, వారాల పాటు సమయం పట్టడం కంటే, కొన్ని నిమిషాల్లోనే పనులు పూర్తవుతాయని మంత్రి వెల్లడించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నగరవాసులకు సులభతరమైన అనుభవం కలుగుతుందని అన్నారు.

రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యత :

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఇక్కడ గృహాల కొనుగోళ్లు బెంగళూరుతో పోలిస్తే ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఐటీ రంగంలో దాదాపు 10 లక్షల మంది నగరవాసులు పని చేస్తుండటం, గ్రోహబ్ నివేదిక ప్రకారం హైదరాబాద్ ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో టాప్ 5లో ఉండటం వంటి అంశాలు నగరానికి ప్రత్యేకతను చాటుతున్నాయి.

పచ్చదనం, సుందరీకరణకు ప్రాధాన్యత :

నగర సుందరీకరణ కోసం 214 కిలోమీటర్ల ఈవెన్యూ ప్లాంటేషన్ ప్రాజెక్ట్ ను చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. చెరువులు, కుంటలు, పార్కుల అభివృద్ధితో పాటు సమగ్ర మురుగు నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందించామన్నారు.

సోషల్ మీడియా ప్రచారాలపై స్పందన :

మూసీ నది ప్రక్షాళన పేరిట పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.

వేగవంతమైన సేవలు – సంతోషకర పరిణామం :

బిల్డ్ నౌ వ్యవస్థ ద్వారా ప్రజల పనులు వేగవంతంగా పూర్తవుతాయని, భవన నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తేలికగా పొందేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. కొత్త వ్యవస్థతో హైదరాబాద్ నగర అభివృద్ధికి కొత్త ప్రేరణ లభించనుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Read Also : Hyderabad Global City : హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం – సీఎం రేవంత్