Minister Seethakka : అధికారులను హెచ్చరించిన మంత్రి సీతక్క

మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (Minister Seethakka)..తన మార్క్ చూపిస్తుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పదవి దక్కినప్పటికీ..తనను మేడం అని కాకుండా.. సీతక్కగానే పిలవాలని కోరారు. సీతక్క అన్న పిలుపులోనే ఆప్యాయత ఉంటుందని.. ఎంత ఎదిగినా తాను ప్రజల మనిషినేనని అన్నారు. పదవులు శాశ్వతం కాదని, విలువలు ముఖ్యమన్నారు. ఈమె మాటలు అక్కడి వారినే కాదు రాష్ట్ర ప్రజలను సైతం ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో అధికారులను (Officers) హెచ్చరించారు. […]

Published By: HashtagU Telugu Desk
Minister Seethakka

Minister Seethakka

మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (Minister Seethakka)..తన మార్క్ చూపిస్తుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పదవి దక్కినప్పటికీ..తనను మేడం అని కాకుండా.. సీతక్కగానే పిలవాలని కోరారు. సీతక్క అన్న పిలుపులోనే ఆప్యాయత ఉంటుందని.. ఎంత ఎదిగినా తాను ప్రజల మనిషినేనని అన్నారు. పదవులు శాశ్వతం కాదని, విలువలు ముఖ్యమన్నారు. ఈమె మాటలు అక్కడి వారినే కాదు రాష్ట్ర ప్రజలను సైతం ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో అధికారులను (Officers) హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రజలు తమ సమస్యలతో అధికారుల వద్దకు వస్తే వెంటనే పరిష్కరించాలని, కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని సూచించారు. అధికారులంతా నిబద్ధతతో అంకితభావంతో ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని తెలిపారు. క్రింది స్థాయి అధికారులు శాఖ పురోగతికి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటానికి తగు సూచనలు, సలహాలను ఇవ్వాలని సూచించారు. గ్రామాలలో అన్ని మౌళికసదుపాయాలను కల్పించాలని, గ్రామాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో ఎలాంటి జాప్యం జరగకూడదని అధికారులను ఆదేశించారు.

Read Also : Anganwadi Workers Protest : ప్రతిసారీ అంగన్వాడీ జీతాలు పెంచుతామని తాము చెప్పలేదు – మంత్రి బొత్స

  Last Updated: 29 Dec 2023, 09:37 PM IST