బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ఫై మంత్రి సీతక్క (Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు మాట్లాడుతూ..కాంగ్రెస్ సర్కారుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో.. రైతులు వడ్లు అమ్ముకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.500 బోనస్ ఇచ్చి మరీ కొంటామని హస్తం నేతలు చెప్పినట్టు హరీశ్ రావు గుర్తు చేశారు. మరోవైపు డిసెంబర్ 9 నుంచే రైతుబంధు డబ్బులు రూ.15 వేలు పంపిణీ చేస్తామని తెలిపినట్టు ప్రస్తావించారు. అయితే.. ఈ రెండు విషయాల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని.. మాట తప్పిందని.. రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
దీనిపై సీతక్క స్పందిస్తూ..హరీష్ రావు ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటి ప్రభుత్వం అమలు చేస్తుందని , అధికారం చేపట్టి రెండు రోజులు కూడా కాకముందే.. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పందగా ఉందని సీతక్క తెలిపారు. ఒక్కొక్కటిగా అన్ని అమలు చేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని.. మాట తప్పే ప్రసక్తే లేదని హరీష్ రావు కు కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అసలు బోనసే ఇవ్వలేదని.. వడ్ల కొనుగోళ్లలో రైతులను తీవ్రంగా మోసం చేశారని ఆరోపించారు. క్వింటాల్ ధాన్యంలో సుమారు 10 కిలోలు తీసేసి.. రైతులను చాలా ఇబ్బంది పెట్టారని గుర్తుచేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి చేయలేదన్నారు. రైతుబంధు ద్వారా వందల ఎకరాలు ఉన్న భూస్వాములే లబ్ది పొందారని సీతక్క పేర్కొన్నారు.
Read Also : ఇక ఆ వాహనాలపై కేసీఆర్ ఫోటోలు కనిపించవు..