Site icon HashtagU Telugu

Minister Seethakka: కేటీఆర్ తొందర పడకు అసలు కథ ముందుంది : మంత్రి సీతక్క

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka: కేటీఆర్ అప్ప‌డే తొంద‌ర‌ప‌డి విమ‌ర్శ‌లు చేయకండి అసలు కథ ముందుంది అంటూ కెటిఆర్ కు మంత్రి సీత‌క్క కౌంట‌ర్ ఇచ్చారు.. అధికారంలోకి వ‌చ్చిన రెండు రోజుల‌లో కీల‌క హామీలు అమ‌లు చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నింద త‌మ‌పై వేస్తుందంటూ కెటిఆర్ చేసిన కామెంట్స్ పై ఆమె మండిప‌డ్డారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధ్యం కాని హామీలు ఇచ్చారన్న వ్యాఖ్యాల‌ను తీవ్రంగా ఖండించారు మంత్రి సీతక్క. అసెంబ్లీ లాబీలో ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ నేతలకు అంత తొందర పాటు వద్దన్నారు. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్‌ను వెంటాడు తోందన్నారు. తాము ఇస్తా అన్న దానికి బీఆర్ఎస్ వాళ్ళు పెంచి చెప్పారు కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని ఆమలు చేస్తామని సీతక్క స్పష్టంచేశారు. ఒక్కో హామీని క్ర‌మ ప‌ద్ద‌తిలో అమలు చేస్తు న్నామని క్లారిటీ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని ఆమె అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించి నందుకు ప్రజలంతా సంతోషంగా ఉన్నారని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు.

Also Read: Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ, తొక్కిసలాటలో ఒకరు మృతి