జన్వాడ ఫామ్ హౌస్లో సోదాలు చేయాలని సీఎం చెప్పలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేసారు. తాము ఎవ్వరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడట్లేదని , బుకాయిస్తే తప్పు ఒప్పు కాదన్నారు. ఫిర్యాదు వస్తేనే పోలీసులు సోదాలు చేశారని , కావాలనే కొందరు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. నిజంగా నిర్దోషులు అయితే చట్టరీత్యా క్లియరెన్స్ తెచ్చుకోవాలన్నారు.
జన్వాడ రిజర్వ్ కాలనీలోని రాజ్ పాకాల ఫాంహౌస్‌లో స్పెషల్ పార్టీ జరిగింది. దీనిపై పక్కా సమాచారంతో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు జరిపారు. భారీ శబ్ధాలతో పార్టీ జరుగుతుండగా, భారీ ఎత్తున ఫారిన్ మద్యం బాటిళ్లను గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ జరుగుతుండడంతో డ్రగ్స్ అనుమానాలు కలిగాయి. దీంతో పోలీసులు అక్కడున్న వారికి పరీక్షలు జరిపారు. ఓ వ్యక్తికి కొకైన్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు, సెక్షన్ 34, ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు పెట్టినట్లు పేర్కొన్నారు.
ఇక ఈ పార్టీ పై కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు. ‘అది ఫాంహౌస్ కాదు. నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు. గృహప్రవేశం చేసినప్పుడు పిలవలేదని ఇప్పుడు ఫ్యామిలీకి పార్టీ ఇచ్చాడు. లిక్కర్ కూడా ఉండొచ్చు. ఆ పార్టీలో నా అత్తమ్మ (నా భార్య తల్లి) , పిల్లలు , బంధువులు ఇలా అంత ఉన్నారు. దావత్ చేసుకోవద్దా..? దావత్ చేసుకునేది కూడా ప్రభుత్వాన్ని అడిగి చేసుకోవాలా..? రాజకీయంగా తమను ఎదుర్కోలేక తమ బంధువులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. కుట్రలతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు..ఇలాంటి చిల్లర ప్రయత్నాలు, కేసులకు తాము భయపడేరకం కాదు. ప్రజల్లో తమపై ఓ దుష్ప్రచారం చేసే భాగంగానే రేవ్ పార్టీ(Rave party) అని ప్రచారం చేసింది. డ్రగ్స్ దొరకలేదని ఎక్సైజ్ అధికారులు(Excise Officers) చెప్పారు. ఉదయం ఎక్సైజ్ కేసు.. సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయిందని అన్నారు.
అసలు డ్రగ్స్ ఎవరు, ఎక్కడ తీసుకున్నారో తెలుసుకోండి ఫస్ట్.. టెస్టు చేస్తే 12 మందికి నెగిటివ్, ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది..ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నారో కనుకోండి.. తమ కుటుంబ సభ్యులు ఫంక్షన్‌కు వస్తే.. పలువురు మహిళలు, పలువురు పురుషులు అని వార్తలు రాయడం ఎంత వరకు కరెక్ట్. మీము పబ్లిక్ లో ఉన్నామని చెప్పి..ఏది పడితే అది రాసేసి..ఏది పడితే అది అనేస్తే చెల్లుతుందా..? తాను అక్కడే ఉన్నానని..పోలీసులు వచ్చే 5 నిమిషాల ముందు అక్కడి నుండి వెళ్లిపోయానని ప్రచారం చేస్తున్నారు. నిన్న సాయంత్రం కేసీఆర్ దగ్గర ఉన్న..అక్కడి నుండి నేరుగా ఇంటికి వచ్చి , భోజనం చేసి , కాసేపు టీవీ చూసి..కూతురి తో మాట్లాడి పండుకున్నానని ఉదయం లేచేసరికి ఈ వార్తలు చూసి షాక్ అయ్యాయని తెలిపాడు.
Read Also : Janwada Farm House Party : డీజీపీకి కేసీఆర్ ఫోన్