Site icon HashtagU Telugu

Gram Gold Scheme : ‘తులం బంగారం’ పథకం లేదని తేల్చేసిన మంత్రి పొన్నం ..?

Ponnam Prabhakar Gram Gold

Ponnam Prabhakar Gram Gold

తెలంగాణలో తులం బంగారం పథకం (Gram Gold Scheme) అమలుపై గత కొద్దీ రోజులుగా రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. ఈరోజు శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత ఈ పథకం అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. మహిళలకు తులం బంగారం పథకం (Gram Gold Scheme) అమలు చేయట్లేదని స్పష్టం చేశారు. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని కవిత మండిపడ్డారు. ఈ పథకం అమలుపై భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని మంత్రి సమాధానమిచ్చారు.

Babri Like Fate : బాబ్రీకి పట్టిన గతే ఔరంగజేబు సమాధికీ.. వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ వార్నింగ్

పెళ్లి కానున్న పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ప్రజలను నమ్మక ద్రోహానికి గురి చేసినట్లు స్పష్టమవుతుందని కవిత అన్నారు. హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచినప్పుడు అవి ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానం అని రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు.

Tata EV: టాటా నుంచి మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్ తో ఏకంగా అన్ని కిలోమీటర్ల ప్రయాణం!

మహిళల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణలో గత ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు భరోసా కల్పించాయని, కానీ కాంగ్రెస్ పాలనలో మహిళలు నిరాశకు గురవుతున్నారని ఆమె అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడారని, ఆ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని కవిత పేర్కొన్నారు. తాము ఈ విషయంలో పోరాటం కొనసాగిస్తామని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగిన విధంగా ప్రశ్నించాలని ఆమె కోరారు.