సింగరేణి (Singareni )లో జంగ్ సైరన్ మోగడంతో తెలంగాణ మంత్రులు తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అలాగే రూ. 20 లక్షల వడ్డీలేని రుణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ తరఫున ప్రచారం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
సింగరేణి కార్మికులను తాను ఆదుకుంటానని, కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం కృషి చేస్తానన్నారు.
గడిచిన పది సంవత్సరాలు నామవాత్ర ఉద్యోగాలు నియమించారని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను చేపట్టే కార్యక్రమం ప్రారంభించిందని పొంగులేటి అన్నారు. సింగరేణిలో కార్మికుల వైద్యానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ఆయన హామి ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సభ్యులు ఐఎన్‌టీయూసీలో చేరారు. కారుణ్య నియామకాలను నిష్పక్షపాతంగా చేపడతామని మంత్రి పొంగులేటి తెలిపారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో మంత్రితో పాటు స్ధానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా పాల్గొన్నారు.
మరోపక్క పెద్దపల్లిలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఐఎన్‌టీయూసీ తరఫున శ్రీధర్‌బాబు ప్రచారం చేశారు. ఆర్‌జీ 3 పరిధిలోని ఏఎల్‌పీ, ఓసీపీ-1, ఓసీపీ-2 బొగ్గు గనుల్లో మంత్రి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తామని హామి ఇచ్చారు.
Read Also : KA Paul Meet With CM Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన KA పాల్