మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Rreddy Convoy)కి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చర్ కావడం తో ఒక్కసారిగా కారు కాస్త అటుఇటు వెళ్లడంతో అంత షాక్ అయ్యారు. ఈ ఘటన లో ఎలాంటి ప్రమాదం జరగకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. పాలేరు నుండి సత్తుపల్లి వెళ్తుండగా వైరా బ్రిడ్జి దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు, భద్రత సిబ్బంది అప్రమత్తం అయ్యి..వెంటనే మంత్రి పొంగులేటిని మరో వాహనంలో సత్తుపల్లికి పంపించారు.
We’re now on WhatsApp. Click to Join.
అంతకు ముందు పాలేరు రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసారు మంత్రి. ఈ క్రమంలో పవర్ ప్లాంట్ ను సిద్ధం చేయకపోవడంపై అధికారులపై మంత్రి సీరియస్ అయ్యారు. నీరు వస్తుందని తెలిసినా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అధికారులను నిలదీశారు. మీ నిర్లక్ష్యం కారణంగా ప్రజల సంపదను వృథా చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి బాధ్యులైన ఉన్నతాధికారులకు ఫోన్ లోనే వార్నింగ్ ఇచ్చారు. కనీసం మీరు తీసుకున్న జీతం మందం అయినా పని చేయాండి అంటూ మందలించారు. గత 2 సవంత్సరాలుగా నీరు లేక విలవిలలాడిన దిగువ ఆయకట్టు రైతులకు పాలేరు పెద్ద కాలువ ద్వారా నీరు విడుదల చేయడం చాలా సంతోషకరంగా ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. నాగార్జున సాగర్ కింద ఉన్న సుమారు 2 లక్షల 75 వేల ఎకరాల ఆయకట్టుకు కృష్ణానీటిని విడుదల చేశామన్నారు. సుమారు 37 మండలాల్లో తెలంగాణతో పాటు ఏపీ ప్రాంతానికి వెళ్తాయన్నారు.
Read Also : Pawan Kalyan : కర్ణాటక సీఎంతో పవన్ కళ్యాణ్ భేటి