Telangana Panchayat Elections : పంచాయతీ ఎన్నికలఫై మంత్రి పొంగులేటి క్లారిటీ

సర్పంచ్ ల పదవి కాలం పూర్తి అయ్యి నెలలు కావొస్తున్నా ఇంకా పంచాయతీ ఎన్నికలఫై క్లారిటీ లేదు

Published By: HashtagU Telugu Desk
Minister Ponguleti Srinivas

Minister Ponguleti Srinivas

తెలంగాణ లో పంచాయతీ ఎన్నికలు (Telangana Panchayat Elections) ఎప్పుడు జరుగుతాయా అని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్పంచ్ ల పదవి కాలం పూర్తి అయ్యి నెలలు కావొస్తున్నా ఇంకా పంచాయతీ ఎన్నికలఫై క్లారిటీ లేదు. ఈ క్రమంలో ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని అంత మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో మంత్రి పొంగులేటి (Minister Ponguleti Srinivas Reddy) క్లారిటీ ఇచ్చారు. బీసీ జనగణన అనంతరం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేసారు. ఈ సందర్భాంగా గత ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు.

We’re now on WhatsApp. Click to Join.

శుక్రవారం.. కరీంనగర్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ చేసిన తప్పులకు శిక్ష తప్పదని , తాము గులాబీ పార్టీ లాగా గొప్పలకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. నాలుగు గోడల మధ్య తాము ఏ నిర్ణయాలు తీసుకోవడం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని పొంగులేటి పేర్కొన్నారు. ప్రజల మధ్యలో వారి అభిప్రాయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలిస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నట్లే, తెలంగాణ కు సైతం న్యాయంగా రావాల్సిన నిధులను సక్రమంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము కోరుతున్నామని పొంగులేటి తెలిపారు.

ఇక ధనిక తెలంగాణను గత సర్కార్ అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసి పోయారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాప్, ఇరిగేషన్, కరెంట్‌తో అరాచకాలు చేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిన పాము అని, ఇంకా చంపాలని తాము అనుకోవడం లేదన్నారు. ధరణి చట్టాన్ని సవరించనున్నట్లు మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ మంచి చేస్తే మంచి అని చెబుతాం, కానీ వారి చెడును కూడా ప్రజలకు చూపించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

Read Also : Pushpa 2 : పుష్ప 2 గొడవలకు ఫుల్ స్టాప్.. పుష్ప షూట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

  Last Updated: 19 Jul 2024, 07:26 PM IST