తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Elections)పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రాజకీయం ద్వారా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కుల గణన పూర్తయ్యిందని, దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు.
Pragya Jaiswal : పాపం..బాలయ్య హీరోయిన్ ఎంత చూపించిన పట్టించుకునే నాథుడే లేడు
గతంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు పరచేందుకు అసెంబ్లీలో బిల్లు ఆమోదించడంతో పాటు, త్వరలోనే ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయంతో బీసీ వర్గాల్లో భారీ స్థాయిలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు ఈ నిర్ణయం అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
AP Liquor Case : విజయసాయికి మరోసారి సిట్ నోటీసులు
ఇక గత కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై తాజా కేబినెట్ సమావేశంలో సమీక్ష జరిపినట్లు సమాచారం. 2023లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు 18 కేబినెట్ సమావేశాలు జరిగినట్టు తెలిపారు. ఈ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలు, ఇతర పాలనాసంబంధిత కీలక అంశాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది. ఇక కాసేపట్లో మీడియా సమావేశంలో అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.