Site icon HashtagU Telugu

KTR – Gangavva : గంగవ్వతో కలిసి నాటుకోడి కూర వండిన కేటీఆర్.. వీడియో వైరల్

Ktr Gangavva

Ktr Gangavva

KTR – Gangavva :  మంత్రి కేటీఆర్ స్వయంగా బగారా రైస్‌, నాటుకోడి కూర వండారు. ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానల్ టీమ్‌‌తో కలిసి ఆయన వంట చేశారు. ఇప్పటికే గంగవ్వ బాగా ఫేమస్ కాగా, అనిల్, అంజి పలు సినిమాల్లోనూ యాక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. ఇప్పటికే సమంతతో పాటు చాలామంది ప్రముఖులను గంగవ్వ ఇంటర్వ్యూలు చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న ప్రస్తుత తరుణంలో మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్‌ టీంతో మంత్రి కేటీఆర్ సందడి చేశారు. పచ్చటి పంట పొలాల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో వారితో కలిసి కేటీఆర్ నాటుకోడి కూర వండారు. ఈక్రమంలో మై విలేజ్ షో టీం అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. తన కుటుంబ వివరాలను పంచుకున్నారు. చిన్ననాటి పరిస్థితులను ఈసందర్భంగా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘నాకు ఈత రాదు. నాది అరేంజ్డ్ మ్యారేజ్. ఎమ్మెల్సీ కవిత నా కంటే మూడేళ్లు చిన్నది. రాఖీ పండుగ రోజు కవితకు చీర పెట్టాను. నాకు ఇద్దరు బావమరుదులు ఉన్నారు. వాళ్లు నన్ను బాగా చూసుకుంటారు’’ అని కేటీఆర్ తెలిపారు. ‘‘రైతు బంధు పడుతుందా ? లేదా ?’’ అని కేటీఆర్ అడగగా.. ‘‘నాకు రైతు బంధు వస్తోంది’’ అని గంగవ్వ బదులిచ్చారు. ‘‘సిరిసిల్లలో నేను పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా ఎవ్వరికీ ఒక్క చుక్క మందు కూడా పోయలేదు. ఒక్క నోటు పంచలేదు. అయినా ప్రజలు నన్ను గెలిపించారు. మంచి చేస్తామని నమ్మకం ప్రజలకు కల్పించగలిగితే ప్రజలు అక్కున చేర్చుకుంటారు’’ అని కేటీఆర్ అన్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్(KTR – Gangavva) చేశారు.

Also Read: Kodi Pulao : అదిరిపోయే కోడి పలావ్.. పక్కా కొలతలతో ఇలా చేయండి..