KTR: మామ పాడే మోసిన మంత్రి కేటీఆర్!

మంత్రి కేటీఆర్ (KTR) తన మామ పాడే మోశారు. దగ్గరుండి అంత్యక్రియలను నిర్వహించారు.

Published By: HashtagU Telugu Desk
Ktr uncle

Ktr

సీఎం కేసీఆర్ వియ్యంకుడు, కేటీఆర్ (Minister KTR) మామ పాకాల హరినాథరావు గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు. ఇవాళ హైదరాబాద్ లో హరినాథ రావు అంత్యక్రియలు జరిగాయి. మంత్రి కేటీఆర్ (Minister KTR), ఆయన కొడుకు హిమాన్షు హరినాథరావు పాడే మోశారు. తండ్రి తర్వాత తండ్రిలాంటి మామను కోల్పోయిన (Minister KTR) తీవ్ర విషాదంలో కనిపించారు. ఆసుపత్రి నుంచి మొదలుకుని అంత్యక్రియల వరకు అన్ని తానై వ్యవహరించారు. తండ్రి మరణంతో బోరున విలపిస్తున్న సతీమణి శైలిమ, పిల్లలు హిమాన్షు, అలేఖ్యను ఓదార్చారు.

రెండు రోజుల క్రితం హరినాథరావుకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆయనను బతికించడానికి వైద్యులు అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ శ్రేణులు సంతాపాన్ని ప్రకటించాయి.

Also Read : Mass hysteria: వెరీ డేంజర్ ‘మాస్ హిస్టిరియా’.. వింతగా ప్రవర్తిస్తున్న పిల్లలు!

  Last Updated: 30 Dec 2022, 02:06 PM IST