Site icon HashtagU Telugu

MIM For INDIA : కాంగ్రెస్ కు పరోక్షంగా MIM జై! BRS ఔట్ ?

MIM For INDIA

MIM For INDIA

తెలంగాణ రాజ‌కీయాల‌ను మార్చేలా ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ స్వ‌రం (MIM For INDIA)మారుతోంది. విప‌క్ష కూట‌మి స‌మావేశానికి ఆహ్వానం లేక‌పోవ‌డంపై మాట్లాడుతూ అంట‌రాని పార్టీకి చూడొద్దంటూ వ్యాఖ్యానించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఉలిక్కిప‌డుతోంది. రాబోవు రోజుల్లో విప‌క్ష కూట‌మిలోకి ఎంఐఎం వెళితే, జ‌రిగే ప‌రిణామాల‌ను త‌ర‌చుకుంటూ కేసీఆర్ అండ్ బ్యాచ్ వ‌ణికిపోతోంది. అందుకే, ప్ర‌త్యామ్నాయ ఆలోచ‌న చేస్తోంది. ముస్లిం ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి తాయిలాలను ప్ర‌క‌టిస్తోంది.

విప‌క్ష కూట‌మి స‌మావేశానికి ఆహ్వానం లేక‌పోవ‌డంపై అస‌దుద్దీన్ (MIM For INDIA)

పేద మైనార్టీల‌కు లక్ష రూపాయ‌ల స‌హాయాన్ని ప్ర‌క‌టించ‌డానికి బీఆర్ఎస్ (MIM For INDIA) సిద్ద‌మ‌యింది. బ్యాంకుల‌తో సంబంధం లేకుండా నేరుగా ల‌బ్దిదారుల‌కు పార్టీ ప‌రంగా అందించేలా స్కెచ్ వేస్తోంది. ప‌లు మైనార్టీ కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్లుగా నియ‌మితులైన వారిని మంత్రులు హ‌రీశ్‌రావు, మ‌హ‌ముద్ అలీ స‌న్మానించిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో మైనార్టీలకు ల‌క్ష ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

మైనార్టీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తాంటూ మంత్రి హ‌రీశ్ రావు కితాబు ఇచ్చారు. రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేసిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. హిందూవుల‌కు క‌ల్యాణ‌లక్ష్మి అమ‌లు చేసిన‌ట్లు, మైనార్టీల కోసం షాదీ ముబార‌క్ అమ‌లు చేస్తున్న సంగ‌తిని ఫోక‌స్ చేశారు. ఇక ఇటీవ‌ల పాత బ‌స్తీలోకి మెట్రో రైల్ ప్రాజెక్టును విస్త‌రిస్తామ‌ని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. వాస్తవంగా చాలా కాలంగా ఎంఐఎం చేస్తోన్న డిమాండ్ల‌లో అదొకటి. దానికి ఇప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం వెనుక ఎన్నిక‌ల వ్యూహాలు దాగి ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : Asaduddin’s master plan : కేసీఆర్ కోసం MIM `కింగ్ మేక‌ర్` అస్త్రం!

గ‌త తొమ్మిదేళ్లుగా ఎంఐఎం మ‌ద్ధ‌తుతో కేసీఆర్ ప‌రిపాల‌న సాగిస్తున్నారు. రెండుసార్లు వ‌రుస‌గా సీఎం కావ‌డానికి ఎంఐఎం మ‌ద్ధ‌తు ప్ర‌ధాన కార‌ణంగా కనిపిస్తోంది. స‌హ‌జ మిత్రునిగా ఎంఐఎంను భావిస్తూ విప‌క్షంలోని ఏ పార్టీ ఇవ్వ‌నంత గౌర‌వం కేసీఆర్ ఇస్తుంటారు. పాత బ‌స్తీకి సంబంధించిన ఎంఐఎం సానుకూల అంశాల్లో చురుగ్గా కేసీఆర్ స్పందిస్తుంటారు. ప్ర‌తిగా ఎన్నిక‌ల్లో ముస్లిం మైనార్టీ ఓట‌ర్ల‌ను కేసీఆర్ కు అనుకూలంగా మ‌ల‌చ‌డంలో అస‌దుద్దీన్ స‌హాయం చేస్తుంటార‌ని అంద‌రికీ తెలిసిందే.

కాంగ్రెస్, ఎంఐఎం మ‌ధ్య కుదిరిన ప‌రోక్ష ఒప్పందం (MIM For INDIA)

కొన్ని ద‌శాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ఎంఐఎం పోటీ చేసింది. ఆ పార్టీ బ‌ల‌ప‌డుతూ రావ‌డానికి కార‌ణం కూడా కాంగ్రెస్సే. కానీ, రాష్ట్రం విడిపోయిన త‌రువాత కేసీఆర్ ప‌క్షాన ఎంఐఎం చేరింది. కేంద్ర, రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి అండ‌గా ఉండే ఎంఐఎం గ‌త తొమ్మిదేళ్లుగా దూరంగా ఉంటోంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌రువాత పున‌రాలోచ‌న‌లో ప‌డింది. అందుకే, ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పాల్గొన‌కుండా దూరంగా ఉంది. లేదంటే, బీహార్, యూపీ త‌ర‌హా ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ముందుగానే ఎంఐఎం గ్ర‌హించింది. ఆ విష‌యంలో కాంగ్రెస్, ఎంఐఎం మ‌ధ్య కుదిరిన ప‌రోక్ష ఒప్పందం క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఫ‌లితాన్ని ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ విప‌క్ష కూట‌మి ఎంఐఎం ను (MIM For INDIA)విశ్వాసంలోకి తీసుకోవ‌డంలేదు.

45 స్థానాల్లో ఎంఐఎం ను రంగంలోకి దించ‌డానికి ప్లాన్

ఏడు స్థానాల్లో మాత్ర‌మే ఎంఐఎం గెలిచే అవకాశం ఉంది. మిగిలిన స్థానాల్లో తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ కు మ‌ద్ధ‌తు ఇస్తూ వ‌స్తోంది. అయితే, ఈసారి ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ బ‌య‌ట కూడా పోటీ చేయాల‌ని భావిస్తోంది. క‌నీసం 45 స్థానాల్లో తెలంగాణ వ్యాప్తంగా ముస్లిం ఓట్లు ఎక్కువ‌గా ఉండే చోట్ల పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఆ ఆలోచ‌న వెనుక కేసీఆర్ వ్యూహం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో మైనార్టీ ఓట్లు సాలిడ్ గా కాంగ్రెస్ పార్టీకి ప‌డే అవ‌కాశం ఉంది. అందుకే, ఆ ఓటు బ్యాంకును చీల్చ‌డానికి 45 స్థానాల్లో ఎంఐఎం ను రంగంలోకి దించ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని.(MIM For INDIA) ఇటీవ‌ల వినిపిస్తోంది.

కాంగ్రెస్ పొత్తుకు ఎంఐఎం వ‌స్తే మాత్రం బీఆర్ఎస్, బీజేపీ ఔట్

విప‌క్ష కూట‌మి(ఇండియా) స‌మావేశానికి ఆహ్వానించ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుబడుతోన్న అస‌రుద్దీన్ వ్యూహం  (MIM For INDIA) క‌నిపిస్తోంది. అంటే, రాబోవు రోజుల్లో విప‌క్ష కూట‌మిలో క‌ల‌వ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌న్న సంకేతం పంపించారు. అదే జ‌రిగితే, కాంగ్రెస్ తో క‌లిసి ఎంఐఎం ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి అవ‌కాశం ఉంది. పాత దోస్తీ మ‌ళ్లీ చిగురించ‌డానికి ఛాన్స్ ఉంది. అప్పుడు బీఆర్ఎస్, బీజేపీ ఘోర ఓట‌మిని చ‌విచూడాల్సి వ‌స్తుంద‌ని అంచనా. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంఐఎంను విశ్వాసంలోకి తీసుకోవ‌డంలేదు. ప్ర‌ధాని మోడీ, కేసీఆర్ వ్యూహాల‌కు త‌గిన విధంగా అస‌దుద్దీన్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని కాంగ్రెస్ కు ఉన్న అనుమానం. నిజంగా కాంగ్రెస్ పొత్తుకు ఎంఐఎం వ‌స్తే మాత్రం ఎన్నిక‌లు జ‌ర‌గ‌క‌ముందే బీఆర్ఎస్, బీజేపీ ఔట్ అయిన‌ట్టే.!

Also Read : Asaduddin meet KCR : సీఎం కేసీఆర్‌తో అస‌దుద్దీన్ ఓవైసీ భేటీ.. యూసీసీ కోడ్‌పై కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం ..