Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లోకి వలసలు.. బీజేపీ ఎమ్మెల్యే చేరిక..!

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కర్ణాటకలోని కుడ్లిగి నియోజకవర్గ ఎమ్మెల్యే గోపాలకృష్ణ కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే నెల 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో..

Published By: HashtagU Telugu Desk
Migration To Karnataka Congress.. Joining Of Bjp Mla..!

Migration To Karnataka Congress.. Joining Of Bjp Mla..!

Karnataka Congress : ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కర్ణాటకలోని కుడ్లిగి నియోజకవర్గ ఎమ్మెల్యే గోపాలకృష్ణ కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే నెల 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఎన్నికలకు ముందు గోపాలకృష్ణ అధికార బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది. గోపాలకృష్ణ బీజేపీని కాదని కాంగ్రెస్‌లో చేరడంతో అధికార పవనాలు ఎటువైపు వీస్తున్నాయో అర్థమవుతున్నదని కర్ణాటక కాంగ్రెస్‌ (Karnataka Congress) అధ్యక్షుడు డీకే శివకుమార్‌ చెప్పారు. ఇక త్వరలో జేడీఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా చేరుతారన్నారు. ఇప్పటికే అనేక సర్వేల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్తున్న సందర్భంగా ఈ వలసలతో కర్ణాటక కాంగ్రెస్ మరింత బలపడుతోందన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Also Read:  Cheruku Sudhakar: హైకోర్టు కు చేరిన చెరుకు సుధాకర్ పంచాయతీ..!

  Last Updated: 12 Apr 2023, 10:35 AM IST