Site icon HashtagU Telugu

Satya Nadella meets KTR: కేటీఆర్ తో సత్య నాదెళ్ల భేటీ.. ఐటీపై చర్చ!

satya nadella meets ktr

Ktr

న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో (PM) సమావేశం ముగిసిన వెంటనే, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈఓ సత్య (నాదెళ్ల Satya Nadella) తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (KTR)ను కలిశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ భేటీ జరిగింది. మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ లో ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. “సత్య నాదెళ్లను కలుసుకోవడం ఆనందంగా ఉంది. మేం బిజినెస్, హైదరాబాద్ బిర్యానీ ఇతర విషయాల గురించి చర్చించుకున్నాం” అని క్యాప్షన్ ఇచ్చాడు. హైదరాబాద్ లో పెట్టుబడులు, ఐటీ సెక్టార్, ఇతర విషయాలను వీరిద్దరూ మాట్లాడుకున్నారు.

మోడీతోనూ భేటీ

సత్య నాదెళ్ల (Satya Nadella) గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. సాంకేతికత, నూతన ఆవిష్కరణల్లో ఇండియా పాత్ర గురించి చర్చించుకున్నారు. డిజిటల్ ఇండియా విజన్‌ను సాకారం చేయడంలో దేశానికి సహాయం చేయడంలో కంపెనీ మద్దతు ఉంటుందని నాదెళ్ల హామీ ఇచ్చారు. “మిమ్మల్ని సత్య నాదెళ్ల (Satya Nadella) కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లలో భారతదేశం పురోగతి సాంకేతికతతో కూడిన అభివృద్ధి యుగానికి నాంది పలుకుతోంది. మన యువత భూగోళాన్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆలోచనలతో నిండి ఉంది” అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

తెలంగాణలో పెట్టుబడులు

8 సంవత్సరాలనుంచి తెలంగాణ (Telangana) రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో తమ ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించిందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు సంతోషం వ్యక్తం చేశారు. టీఎస్ ఐపాస్ తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. 2014 నుంచి గత నెల నవంబర్ వరకు దాదాపు 3 లక్షల 30 వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు (Investments) రాష్ట్రానికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ వివరాలు కేవలం టిఎస్ ఐపాస్, ఐటీ-ఐటీ అనుబంధ రంగాల్లో వచ్చిన పెట్టుబడుల వివరాలు మాత్రమేనన్న కేటీఆర్, మైనింగ్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగంతో పాటు ఇతర రంగాలలోకి వచ్చిన పెట్టుబడులన్నింటిని కలిపితే ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

Also Read: Sreeleela with Ram: రామ్ తో రొమాన్స్ చేయనున్న ధమాకా బ్యూటీ శ్రీలీల!