Free Bus Scheme: మహాలక్ష్మి పథకం కింద టిఎస్‌ఆర్‌టిసిలో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సర్వీసును అమలు చేయడంతో రోజుకు 11 లక్షల మంది ప్రయాణికుల సంఖ్య 18-20 లక్షలకు పెరిగింది. ఎక్కువ మంది ప్రయాణీకులకు సీటింగ్ కల్పించడానికి మరియు కండక్టర్ బస్సులో తిరుగుతూ టికెట్లు జారీ చేయడానికి తగినంత స్థలాన్ని ఇవ్వడానికి సంస్థ సిటీ బస్సులలో మెట్రో మోడల్ సీటింగ్‌ను ప్రయత్నించాలని నిర్ణయించుకుంది.
టిఎస్‌ఆర్‌టిసి గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బస్సుల్లోని కొన్ని సీట్లు తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో మరింత మంది ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం బస్సు మధ్యలో ఉన్న ఆరు సీట్లు తొలగించి మెట్రో రైలు మాదిరి సీటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. నిలబడి ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటుందని యోచిస్తున్నారు.
సిటీ బస్సుల్లో ప్రస్తుతం 44 సీట్లున్నాయి. 63 మంది ప్రయాణిస్తే 100 శాతం ఆక్యుపెన్సీ వస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి అమలు తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. కండక్టర్ టికెట్లు జారీ చేయడం కూడా కష్టంగా మారింది. ఈ సమస్యలకు పరిష్కారం సీటింగ్ వ్యవస్థను మార్చడమేనని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కొన్ని బస్సులలో సీటింగ్ మార్చేసి ప్రయోగాత్మకంగా రంగంలోకి దించింది. ఈ విధానం సక్సెస్ అయితే మొత్తం హైదరాబాద్లోని అన్ని సిటీ బస్సులలో ఇదే విధానాన్ని తీసుకురానుంది.
Also Read: Hyderabad: హైదరాబాద్ పాఠశాలల్లో భారీగా ఫీజుల పెంపు