Weather Today : సైక్లోనిక్ సర్క్యులేషన్ ప్రభావంతో తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. హైదరాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also read : AIMIM vs TDP: ఇప్పుడు ఏపీ ప్రజలు గుర్తుకు వచ్చారా? : టీడీపీ మైనారిటీ
ఇక ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని వాతావరణ విభాగం తెలిపింది. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని అంచనా వేసింది. మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.