Melbourne Telangana Forum : మెల్‌‌బోర్న్‌లో ‘తెలంగాణ’ సాంస్కృతిక సందడి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఆస్ట్రేలియాలోని తెలంగాణవాసులు ఘనంగా జరుపుకున్నారు.

  • Written By:
  • Updated On - June 10, 2024 / 03:21 PM IST

Melbourne Telangana Forum : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఆస్ట్రేలియాలోని తెలంగాణవాసులు ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా శనివారం (జూన్ 8న) మెల్‌బోర్న్ తెలంగాణ ఫోరమ్ (MTF) ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లోని విలియమ్స్‌టౌన్ టౌన్ హాల్‌లో  ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణవాసులంతా ఒక్కచోటుకు చేరి తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం 2024ను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ ఈవెంట్‌లో భాగంగా తెలంగాణ సంస్కృతి, కళలు, చరిత్రను అద్దంపట్టే అనేక కార్యక్రమాలను నిర్వహించారు. వీటిలో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join

రామాయణంలోని కీలకమైన ఘట్టాలను అద్దంపట్టే జానపద నృత్యాలు, ఆకట్టుకునే సంగీత ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు సభకు హాజరైన వారిని అలరించాయి. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన మెల్‌బోర్న్ తెలంగాణ ఫోరమ్‌ను సభకు హాజరైన వారు అభినందించారు. స్థానికంగా ఉంటున్న తెలంగాణవారిని ఏకం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో విక్టోరియన్ మల్టీకల్చరల్ కమ్యూనిటీ చైర్‌పర్సన్ వివియన్ (వివ్), మెల్‌బోర్న్‌లోని ఇండియన్ ఎంబసీ కాన్సుల్ జనరల్ డాక్టర్ సుశీల్ కుమార్ ప్రసంగించారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న తెలంగాణవాసులు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నాలను వారు కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం కొనసాగించాలన్నారు.

Also Read :Terror Attack : కశ్మీర్ ఉగ్రదాడి మా పనే : పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్

ఈ కార్యక్రమంలో మెల్‌బోర్న్ తెలంగాణ ఫోరమ్(Melbourne Telangana Forum) అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీ నూకల మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం అనేది కేవలం మన కల్చరల్ వారసత్వానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు.  మన సంప్రదాయాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసే సందర్భం ఇది. ఈ అంశాలను తెలంగాణవాసులకు చేరువ చేయాలనే ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఆస్ట్రేలియాలో ఉంటున్న పిల్లలు, యువతరానికి వారి మూలాలను గుర్తు చేసే గొప్ప ప్రయత్నం ఇది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన స్పాన్సర్లు, వాలంటీర్లు, ప్రదర్శకులు, హాజరైన వారందరికీ మెల్‌బోర్న్ తెలంగాణ ఫోరమ్ తరఫున  లక్ష్మీ నూకల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మెల్బోర్న్ తెలంగాణ ఫోరమ్ రాబోయే ఈవెంట్‌లకు సంబంధించిన మరింత సమాచారం కోసం www. melbourne telanganaforum.org.auని సందర్శించాలని కోరారు. తమ కార్యాలయాన్ని president4mtf@gmail.com మెయిల్ ఐడీ, 0422 378 094 ఫోన్ నంబరు ద్వారా కాంటాక్ట్ చేయొచ్చన్నారు.

Also Read : Kishan Reddy : పూలబొకేలు, శాలువాలు, స్వీట్లు తేవొద్దు.. ఆ ఒక్క పని చేయండి : కిషన్ రెడ్డి