చిరంజీవి (Chiranjeevi) ‘అందరివాడు’ అని మరోసారి రుజువు చేసాడు. మొన్నటి వరకు చిత్రసీమకు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య కనిపించని వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ వార్ చూసి చాలామంది రేవంత్ సర్కార్ కు టాలీవుడ్ నుండి ఇబ్బంది తప్పదని , చిత్రసీమ మొత్తం ఒకటైందని అభిమానులు మాట్లాడుకున్నారు. కానీ వారు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. రేవంత్ సింగిల్ అవ్వడం కాదు చిత్రసీమ సింగిల్ అవుద్దని అంత ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు చొరవ చేసి ఇరు వర్గాలను కలిపి చిత్రసీమకు ఊరట కల్పించారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఇండస్ట్రీ కి పెద్ద దిక్కు గా ఉంటాడనే సంగతి తెలిసిందే. చిత్రసీమలో ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చిన ముందు ఉండి చూసుకుంటాడు. మొన్న అల్లు అర్జున్ (Allu Arjun Arrest)విషయంలో కూడా అయన చొరవ తీసుకున్నారని , సీఎం రేవంత్ (CM Revanth) తో మాట్లాడి సమస్యను సర్దుమణిగేలా చేసాడని చాలామంది అనుకుంటున్నారు.
Monalisa Bhosle : మోనాలిసా కు ఫస్ట్ మూవీ ఛాన్స్..డైరెక్టర్ ఎవరంటే..!
ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి హాజరు కావాలంటూ.. సీఎంవో నుంచి చిరుకు ఆహ్వానం అందడంతో హుటాహుటిన చిరు కూడా.. సీఎం రేవంత్‌తో కలిసి సదరు కార్యక్రమంలోపాల్గొనడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రొద్దుటూరులో ప్రభుత్వం ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఎకో ఫ్రెండ్లీ(Experium Eco Park) ఎక్సీపీరియం పార్కును నెలకొల్పింది.
సుమారు 30 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ పార్కును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, చిరంజీవిలు కలిసి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కు.. హైదరాబాద్ శివారు ప్రాంతానికే కాకుండా హైదరాబాద్కు కూడా వన్నె తెస్తుందని సీఎం చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి కూడా తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. ఈ పార్కు చాలా విశాలంగా, అద్భుతంగా ఉందని , షూటింగ్‌లకు ఈ పార్కుని ఇస్తారా? అని రాం దేవ్‌ని అడిగారంట. ఫస్ట్ షూటింగ్ చిరంజీవిదే అయితే ఇస్తానని ఆయన అన్నారట. ఇంకో రెండు, మూడేళ్ల తరువాత ఇది చాలా కంటికి ఇంపులా ఈ పార్క్ మారుతుందని, వెడ్డింగ్, రిసెప్షన్స్, ఈవెంట్లకు ఈ పార్కు అనువైనదిగా అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. మొత్తం మీద సీఎం రేవంత్ , చిరు కలిసి పార్క్ ను ఓపెన్ చేయడం ఇటు కాంగ్రెస్ శ్రేణులు , అటు సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.