నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మధిర (Madira) పట్టణంలో ఈరోజు మెగా జాబ్ మేళా(Mega Job Mela)ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) సారధ్యం వహిస్తున్నారు. మధిరలోని రెడ్డి గార్డెన్స్‌లో ఉదయం నుంచే జాబ్ మేళా ప్రారంభం కానుంది. ఈ మేళా ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు అందించాలన్నది ముఖ్య ఉద్దేశం.
IPL 2025 Points Table: ఐపీఎల్ లేటెస్ట్ పాయింట్స్ టేబుల్ ఇదే.. టాప్‌లో ఉంది ఎవరంటే?
ఈ మెగా జాబ్ మేళాకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి 80కి పైగా ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు హాజరుకానున్నాయి. ఐటి, ఫైనాన్స్, మార్కెటింగ్, మాన్యుఫాక్చరింగ్ వంటి విభాగాల్లో ఈ కంపెనీలు ఉద్యోగాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రతిభావంతమైన యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు లభించేందుకు ఇది గొప్ప వేదికగా నిలుస్తోంది. ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి ఇప్పటికే వందలాదిగా యువతీ యువకులు మధిరకు చేరుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే వారు క్యూ లైన్‌లో నిలబడి తమ బాధ్యతను చాటుతున్నారు. ఉపాధి కల్పనతో పాటు యువతలో నూతన ఉత్సాహం నింపే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.