Site icon HashtagU Telugu

Meeting Secrets : జ‌గ‌న్, పొంగులేటి వ్యూహాల‌తో కాంగ్రెస్ ఖ‌త‌మ్‌!

meeting secrets

T Congress

ప్ర‌స్తుతం న‌డుస్తోన్న రాజ‌కీయాల‌ను (meeting secrets)   ఖ‌చ్చితంగా అంచ‌నా వేయ‌డం త‌ల‌పండిన రాజ‌కీయ‌వేత్త‌ల‌కు కూడా అసాధ్యంగా ఉంది. కార‌ణం, ఏ పార్టీ లీడ‌ర్ ఏ పార్టీ అధినేత‌ను క‌లుస్తున్నాడు? అనేది తిక‌మ‌క‌గా ఉంది. అందుకు ఉదాహ‌ర‌ణ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎపిసోడ్ ను తీసుకోవ‌చ్చు. ఆయ‌న ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. భారీ బ‌హిరంగ స‌భ‌ను పెట్ట‌డం ద్వారా రాహుల్ గాందీ ఎదుట బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేశారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది. ఆ త‌రువాత సీన్ గ‌మ‌నిస్తే, రాబోయే రోజుల్లో పొంగులేటి అడుగులు ఎటు ప‌డ‌తాయి? అనేది బోధ‌ప‌డుతోంది.

రాజ‌కీయాల‌ను ఖ‌చ్చితంగా అంచ‌నా వేయ‌డం త‌ల‌పండిన రాజ‌కీయ‌వేత్త‌ల‌కు కూడా అసాధ్యం (meeting secrets)  

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ,  కేసీఆర్ రాజ‌కీయ క‌వ‌ల‌లు. ఆ మాదిరిగా వాళ్ల మ‌ధ్యా ఫెవికాల్ బంధం ఉంది. రాజ‌కీయంగా వైసీపీకి న‌ష్టం జ‌రిగే ప‌ని ప్ర‌ధాని మోడీ చేయ‌రు. అలాగే, బీజేపీకి న‌ష్టం జ‌రిగేలా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌స‌లుకోరు. అయితే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ ను తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీలో (meeting secrets)  చేరే వ‌ర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి డైరెక్ష‌న్లోనే న‌డిచారు. గ‌త కొన్ని నెల‌లుగా రెండుమూడుసార్లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. సీన్ క‌ట్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. వ్యూహాత్మ‌కంగా పొంగులేటిని కాంగ్రెస్ లోకి పంపారు అనుకోవాలి. అంతేకాదు, ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీలో చేర‌డానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇలాంటి ప‌రిణామాన్ని గ‌మ‌నిస్తే రాబోయే రోజుల్లో యూపీఏ ప‌క్షాల‌న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిలుస్తారా? అనే అనుమానం క‌లుగుతోంది.

పొంగులేటి రూపంలో తెలంగాణ రాష్ట్రం మీద పెత్త‌నం చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

ఫెవికాల్ బంధం ఉన్న మోడీని కాద‌ని కాంగ్రెస్ పార్టీకి (meeting secrets)   జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మేలు చేస్తార‌ని ఎవరూ అనుకోరు. కానీ, ప్ర‌స్తుత ప‌రిణామాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగాన్ని బ‌లోపేతం చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. అంటే, పొంగులేటి రూపంలో తెలంగాణ రాష్ట్రం మీద పెత్త‌నం చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ద‌మ‌య్యారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది. అదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌ని బీజేపీ అడుగులు వేస్తున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీకి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించే అవ‌కాశం లేదు. ఇలా ప‌లు కోణాల నుంచి పొంగులేటి, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భేటీల‌ను అవ‌లోక‌నం చేసుకుంటే, రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఏదో జ‌ర‌గ‌రాని న‌ష్టం పొంచి ఉంద‌ని మాత్రం చెప్పొచ్చు.

Also Read : KCR-Modi: ప్రధాని మోడీకి కేసీఆర్ స్వాగతం పలుకుతారా!

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగానికి (meeting secrets)  అనుకూల వాతావ‌ర‌ణం క్రియేట్ అయింది. ఇదే ఊపుతో విజ‌యాన్ని అందుకోవాల‌ని దూకుడుగా వెళుతోంది. కానీ, 70 ప్ల‌స్ రాకుండా కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేదు. ఎందుకంటే, ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు ఉంటార‌న్న న‌మ్మ‌కం లేదు. మ్యాజిక్ ఫిగ‌ర్ 60 వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఆ పార్టీకి క‌ష్టం. అలాంటి ప‌రిస్థితి వ‌స్తే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ టీమ్ హోల్ సేల్ గా బీజేపీ వైపు వెళ్ల‌డానికి ఛాన్స్ ఉంది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డైరెక్ష‌న్లో న‌డిచే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత రాజ‌కీయ ఈక్వేష‌న్ల‌ను సంపూర్ణంగా మార్చ‌గ‌ల స‌త్తా ఉన్న నాయ‌కుడు. అందుకే, పొంగులేటి, ష‌ర్మిల త‌దిత‌రులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కార‌ణ‌మంటూ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : Ponguleti Srinivas Reddy: సీఎం జగన్ ని కలిసిన పొంగులేటి

తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి సామాజికవ‌ర్గం పెత్త‌నం కొన్నేళ్లుగా కొన‌సాగుతోంది. రాష్ట్ర విడిపోయిన త‌రువాత వెల‌మ దొరల పెత్త‌నం తారాస్థాయికి చేరింది. దాన్ని రెడ్డి సామాజిక‌వ‌ర్గం భ‌రించ‌లేక‌పోతోంది. అందుకే, రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు ఉండాల‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప‌లుమార్లు చెప్పారు. అన్ని పార్టీలు రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. ఇప్పుడు అదే జ‌రుగుతోంది. బీజేపీ,కాంగ్రెస్ పార్టీల్లో  రెడ్డి సామాజిక‌వ‌ర్గం నాయ‌క‌త్వం ఉంది. బీఆర్ఎస్ పార్టీ. వెల‌మ దొర‌ల ఆధీనంలో ఉంది. రాబోవు ఎన్నిక‌ల్లో రెడ్డి సామాజిక‌వ‌ర్గం రాజ్యాధికరం దిశ‌గా అడుగులు వేస్తోంది. ఆ దిశ‌గా పొంగులేటి రూపంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కూడా ఏపీ నుంచి చేతులు క‌లిపార‌ని మ‌రో టాక్. అయితే, ఏది చేసినా మోడీ, షా డైరెక్ష‌న్లోనే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తార‌ని అంద‌రికీ తెలిసిందే. అంటే, కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చే ఎన్నిక‌ల త‌రువాత మూడిన‌ట్టే!