Site icon HashtagU Telugu

Meerpet Murder: మీర్‌పేట్‌ ‌ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. ఈ కథ వెనుక ఓ మహిళ..?

Meerpet Madhavai Murder Case

Meerpet Madhavai Murder Case

Meerpet Murder: హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌ ప్రాంతంలో జరిగిన మర్డర్ కేసు దర్యాప్తులో భయానకమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి తన భార్య మాధవిని క్రూరంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి గురువారం నాడు మాధవి పిల్లల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఆ స్టేట్‌మెంట్ ప్రకారం, సంక్రాంతి సెలవుల అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన కూతురుకు భరించలేని దుర్వాసన వచ్చింది. తండ్రిని “అమ్మ ఎక్కడ?” అని అడగ్గా, అతను మౌనం వహించాడని ఆమె చెప్పింది.

Davos : హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్..ఘనస్వాగతం పలికి శ్రేణులు

ఇంట్లో ఫోరెన్సిక్ ఆధారాలు
గురుమూర్తి ఇంట్లో ఫోరెన్సిక్ టీమ్ దర్యాప్తు జరిపి కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. మాధవి యొక్క జుట్టు శాంపిల్స్ కాలిన స్థితిలో దొరకడం, ఆ శాంపిల్స్‌ను పిల్లల డీఎన్‌ఏతో సరిపోల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీ సాయంతో ఇంట్లో రక్తపు మరకలను గుర్తించిన ఫోరెన్సిక్ బృందం, హత్యకు ఉపయోగించిన పలు వస్తువులను స్వాధీనం చేసుకుంది.

హత్యకు కారణమైన వివాహేతర సంబంధం
గురుమూర్తి కొంతకాలంగా సమీప బంధువు అయిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మాధవి, ఆమెతో తీవ్ర వివాదానికి దిగింది. ఈ సంఘటన హత్యకు దారితీసింది. సంక్రాంతి సెలవుల్లో తన పిల్లలను సోదరి ఇంటికి పంపిన గురుమూర్తి, మాధవిని ఇంట్లో చంపేందుకు పన్నాగం పన్నాడు.

గురుమూర్తి ఓటీటీలో చూసిన వెబ్‌సిరీస్ ఆధారంగా, మాధవిని చంపిన తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికాడు. ఆ ముక్కలను బకెట్‌లో వేసి హీటర్‌తో ఉడకబెట్టాడు. శరీర భాగాలను ఎముకల నుంచి విడదీసి ముద్దగా చేసి సంచుల్లో నింపి చెరువులో పడేశాడు. ఈ పనిని రెండ్రోజులపాటు నిద్ర లేకుండా కొనసాగించినట్లు అతను పోలీసులకు వెల్లడించాడు.

తనపై అనుమానాలు లేకుండా నాటకాలు
హత్య చేసిన తర్వాత గదిని శుభ్రం చేసిన గురుమూర్తి, భార్య కనిపించడం లేదని అత్తామామలకు ఫోన్‌లో చెప్పి చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా, మాధవి ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు మాత్రమే కనిపించాయి. పోలీసులు మాధవి మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, డీఎన్‌ఏ రిపోర్టులు, సేకరించిన వస్తువులు ఆధారంగా కోర్టులో గురుమూర్తి నేరాన్ని నిరూపించేందుకు రంగం సిద్ధమైంది. అయితే, చెరువులో పడేసిన శరీర భాగాలకు సంబంధించి ఇంకా ఆధారాలు లభించాల్సి ఉంది.

Jay Shah: డ‌బ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు జై షాకు కొత్త బాధ్యత!