Site icon HashtagU Telugu

Medigadda Safe : మేడిగడ్డ బ్యారేజీ సేఫ్.. చెంప ఛెల్లుమనిపించేలా ‘రిపోర్ట్’ : బీఆర్ఎస్

Medigadda

Medigadda

Medigadda Safe : మేడిగడ్డ బ్యారేజీపై బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఆ బ్యారేజీ సేఫ్ అని వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీలపై కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం అంతా ఉత్తదే అని నిపుణుల బృందం తేల్చేసిందని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీలోని ఒక్క ఏడో బ్లాక్‌లో‌ చిన్న మరమ్మతులు చేసి, దాన్ని యథావిధిగా వాడుకోవచ్చని ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ తేల్చి చెప్పింది.

We’re now on WhatsApp. Click to Join

కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీలపై అనవసర రాద్ధాంతం చేసిన రేవంత్ రెడ్డి, ఇతర నాయకుల చెంప ఛెల్లుమనిపించేలా నిపుణుల బృందం రిపోర్ట్ వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ  వ్యాఖ్యానించింది. కేవలం వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్‌పై,  గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ బురద చల్లుతోందని కారు పార్టీ తెలిపింది. తెలంగాణ శాశ్వత ప్రయోజనాల కోసం నిర్మించిన వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇకనైనా దుష్ప్రచారం ఆపకుంటే, ప్రజలు వాళ్లకు కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమని కామెంట్ చేసింది.

Also Read : 6 Babies Died : పిల్లల ఆస్పత్రిలో అగ్నికీలలు.. ఆరుగురు శిశువులు మృతి.. ఐదుగురు సీరియస్

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో..

కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో గేట్లను తొలగించే పనులను అధికారులు ప్రారంభించారు. 20, 21 గేట్లను పూర్తిగా తొలగించాలని నేషనల్‌ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్‌.డీ.ఎస్‌.ఏ) సూచించింది. ఏడో బ్లాక్‌లో ఏడు గేట్లను ఎత్తే ప్రక్రియ మిగిలి ఉంది. 18, 19, 20, 21 పియర్‌ల గేట్లు ఎత్తడానికి వీలు లేకపోవడంతో వాటిని కట్‌ చేసి తొలగించే యోచనలో అధికారులు ఉన్నారు. శనివారం 20వ గేటు కటింగ్‌ పనులను ప్రారంభించారు. ఈ బ్లాక్‌లోని మిగిలిన మూడు గేట్లు ఎత్తడానికి వీలుగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, బ్యారేజీ దిగువన ఏడో బ్లాక్‌ ప్రాంతంలో భారీగా నీటి ఊటలు వస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని గుర్తించి, నియంత్రించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Also Read :Pan – Aadhaar : ‘పాన్‌-ఆధార్‌’ మే 31లోగా లింక్‌ చేసుకోండి.. లేదంటే డబుల్ పెనాల్టీ