Site icon HashtagU Telugu

Telangana: ఫిలిప్పీన్స్‌లో తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి మృతి.. కారణమిదేనా..?

Telangana

Resizeimagesize (1280 X 720) (3) 11zon

వైద్య విద్య కోసం ఫిలిప్పీన్స్‌ (Philippines) వెళ్లిన తెలంగాణ (Telangana) యువకుడు దావోలో మృతిచెందాడు. గూడూరు మణికాంత్ రెడ్డి అనే విద్యార్ధి ఓపెన్ డ్రైనేజీ కాలువలో పడి మృతి చెందినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి- భువనగిరి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి గూడూరు మణికాంత్ రెడ్డి (21) ఫిలిప్పీన్స్‌లోని దావోలో శవమై కనిపించాడు. ఆదివారం ఉదయం 6 గంటలకు అతడి తల్లిదండ్రులకు సమాచారం అందింది. మణికాంత్ రెడ్డి ఫిలిప్పీన్స్‌లోని దావో మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలంలోని రామలింగంపల్లికి చెందిన రాంరెడ్డి, రాధ దంపతుల కుమారుడు మణికాంత్ రెడ్డి.

Also Read: TTD: టీటీడీని పోలిన మరో నకిలీ వెబ్ సైట్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు

మణికాంత్ తల్లిదండ్రుల ప్రకారం.. వారి కొడుకు మరణానికి కారణంపై భిన్నమైన కారణాలు వినిపించాయి అని తెలిపారు. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి హాస్టల్ భవనం మెట్లపై నుంచి జారిపడి ఓపెన్ డ్రైనేజీ కాలువలో పడి మణికాంత్ రెడ్డి మృతి చెందినట్లు సమాచారం. రెండవది మణికాంత్ మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తుండగా డ్రైనేజీ కాలువలో పడి ప్రమాదానికి గురయ్యాడని సమాచారం అందుతుంది. అయితే మణికాంత్ రెడ్డి మృతిపై స్పష్టమైన కారణం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version