Medaram : మేడారం హుండీల్లో పెద్ద ఎత్తున నకిలీ నోట్లు

మేడారం (Medaram) హుండీల డబ్బు లెక్కింపు (Hundi Collection 2024) ప్రక్రియ గురువారం నుండి మొదలుపెట్టారు. హన్మకొండ లోని TTD కల్యాణ మండపంలో హుండీ లెక్కింపును చేపట్టారు. మొత్తం 518 హుండీలకు గాను ఇప్పటి వరకు 134 హుండీలలో కానుకలను అధికారులు లెక్కించారు. మొదటి రోజు లెక్కింపులో 3 కోట్ల 15 లక్షల 40 వేల రూపాయల ఆదాయం ఆలయానికి వచ్చింది. ఈ మొత్తాన్ని ఎండోమెంట్ అధికారులు బ్యాంకులో జమ చేశారు. ఈ హుండీ కానుకల లెక్కింపు […]

Published By: HashtagU Telugu Desk
Medaram Hundi Counting Begi

Medaram Hundi Counting Begi

మేడారం (Medaram) హుండీల డబ్బు లెక్కింపు (Hundi Collection 2024) ప్రక్రియ గురువారం నుండి మొదలుపెట్టారు. హన్మకొండ లోని TTD కల్యాణ మండపంలో హుండీ లెక్కింపును చేపట్టారు. మొత్తం 518 హుండీలకు గాను ఇప్పటి వరకు 134 హుండీలలో కానుకలను అధికారులు లెక్కించారు. మొదటి రోజు లెక్కింపులో 3 కోట్ల 15 లక్షల 40 వేల రూపాయల ఆదాయం ఆలయానికి వచ్చింది. ఈ మొత్తాన్ని ఎండోమెంట్ అధికారులు బ్యాంకులో జమ చేశారు.

ఈ హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ మొత్తం 10 రోజులు జరగనుందని అధికారులు చెపుతున్నారు. 150 మంది దేవాదాయ శాఖ సిబ్బంది, 200 మంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు హుండీ లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కౌంటింగ్ కొనసాగనుంది. కాగా మొదటి రోజు లెక్కింపు లో కొన్ని హుండీలలో నకిలీ రూ. 100 నోట్లు బయటపడ్డాయి. నోట్లపై గాంధీ బొమ్మకు బదులుగా అంబేద్కర్ ఫొటో దర్శనమిచ్చింది. వెంటనే అక్కడున్న దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు చెప్పగా.. వారు నోట్లను పరిశీలించారు. నోట్లు ముందు, వెనుక కూడా అంబేద్కర్ ఫొటో ఉండటంతో.. వాటిని సేకరించి భద్రపరిచారు. ఇప్పటి వరకూ 20 కి పైగా రూ.100 నోట్లు బయటపడినట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ మేడారం జాతర ఘనంగా జరగ్గా.. 1.40 కోట్ల మంది భక్తులు వనదేవతల్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు తెలిపారు. జాతరలో సమ్మక్క గద్దెల వద్ద 215, సారలమ్మ గద్దెల సమీపంలో 215, పగిడిద్దరాజు గద్దెల వద్ద 26, గోవిందరాజు గద్దె వద్ద 26, మరో 30 క్లాత్ హుండీలను ఏర్పాటు చేశారు. తిరుగువారం నేపథ్యంలో.. సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద మరో 23 హుండీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హుండీల లెక్కింపు జరుగుతుంది.

Read Also : Radisson Drugs Case : రాడిసన్ డ్రగ్స్ కేసులో తెరపైకి కేటీఆర్ బావమరిది..?

  Last Updated: 01 Mar 2024, 11:31 AM IST