IAS Transfers : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి.. భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Rs 1 lakh assistance for minorities-telangana govt

IAS Transfers :  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం రోజు భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ(IAS Transfers) చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్‌‌ను విద్యుత్ శాఖ సెక్రెటరీగా నియమించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు. ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీగా భవిష్ మిశ్రా‌ నియమితులు అయ్యారు. ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సెక్రటరీగా హరిచందనను నియమించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ (ఐపీఎస్)కు అవకాశం ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join

స్పోర్ట్స్ శాఖ ఎండీగా బాలాదేవి (ఐఎఫ్ఎస్), టూరిజం శాఖ ఎండీగా ప్రకాష్ రెడ్డి (ఐపీఎస్),  హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీగా గౌతమ్ (ఐఏఎస్), సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ శాఖ సెక్రెటరీగా అలుగు వర్షిని (ఐఏఎస్)ని తెలంగాణ సర్కారు నియమించింది. వాటర్ బోర్డు ఎండీగా అశోక్ రెడ్డి (ఐఏఎస్), పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రెటరీగా జీ. రవి (ఐఏఎస్)ని నియమించారు.

Also Read : PM Modi : ‘ఎమర్జెన్సీ’ మళ్లీ రావొద్దంటే విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి : ప్రధాని మోడీ

జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్‌ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌, కార్మిక, ఉపాధి శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్‌ కుమార్‌, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించారు. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా ప్రియాంకా అలా (ఐఏఎస్), టూరిజం డైరెక్టర్‌గా త్రిపాఠి (ఐఏఎస్), డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌గా నరసింహారెడ్డి (ఐఏఎస్)ని నియమితులు అయ్యారు.

Also Read :Nara Lokesh : మంత్రిగా లోకేష్ బాధ్యతలు..ఫస్ట్ సంతకం ఆ ఫైల్ పైనే..!!

తెలంగాణ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్‌ విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీగా శైలజ రామయ్య,  ఎన్విరాన్‌మెంట్‌ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా అహ్మద్ నదీమ్, ఫైనాన్స్ డిపార్టుమెంట్‌ ప్రిన్సిపల్ సెక్రెటరీగా సందీప్ కుమార్ సుల్తానియా, కమర్షియల్ టాక్స్ ఎక్సైజ్ డిపార్టుమెంట్‌ సెక్రటరీగా రజ్వీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్‌గా బుద్ధ ప్రకాష్‌ను నియమించారు.

Also Read :6 Mangoes – Rs 2400 : 6 మ్యాంగోస్ రూ.2400.. కేజీ కాకర రూ.1000.. కేజీ  బెండ రూ.650.. ఎక్కడ ?

  Last Updated: 24 Jun 2024, 02:06 PM IST