IAS Transfers : తెలంగాణలో పెద్దఎత్తున ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫర్స్

IAS Transfers : తెలంగాణలోని సీఎం రేవంత్ సర్కారు అన్ని విభాగాల్లో బదిలీల దిశగా చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది.

Published By: HashtagU Telugu Desk
Rs 1 lakh assistance for minorities-telangana govt

IAS Transfers : తెలంగాణలోని సీఎం రేవంత్ సర్కారు అన్ని విభాగాల్లో బదిలీల దిశగా చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటివరకు కీలక సీపీలు, ఇతర ఉన్నతాధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా పెద్దఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా బుర్రా వెంకటేశంకు అడిషనల్ బాధ్యతలు అప్పగించారు.  విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం వ్యవహరించనున్నారు.

  • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్‌ను డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేసింది.
  • జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు.
  • మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా దాన కిషోర్‌ను అపాయింట్ చేశారు.
  • వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఆర్ వి కర్ణన్ నియమితులయ్యారు.
  • మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాకాటి అరుణ, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి అపాయింట్ అయ్యారు.
  • వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా శ్రీదేవి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శిగా వాణి ప్రసాద్,  రోడ్లు, భవనాలతో పాటు రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాస్ రాజు, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా వాని ప్రసాద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన శ్రీనివాస్ రాజు, శ్రీదేవిలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ ప్రభుత్వం అంతకుముందు తొమ్మిది మంది ఐఏఎస్‌‌లకు పోస్టింగ్‌లు ఇచ్చింది. వీరిలో హనుమకొండ అడిషనల్‌ కలెక్టర్‌గా రాధికా గుప్తా, మహబూబ్‌నగర్‌ అడిషనల్‌ కలెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్‌, ములుగు అడిషనల్‌ కలెక్టర్‌గా పి. శ్రీజ, నిర్మల్‌ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్‌ అహ్మద్‌,  మహబూబాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌గా లెనిన్‌ వత్సల్‌ తొప్పో, జనగామ అడిషనల్‌ కలెక్టర్‌గా పర్మర్‌ పింకేశ్‌ కుమార్‌ లలిత్‌ కుమార్‌, జయశంకర్‌ భూపాలపల్లి అడిషనల్‌ కలెక్టర్‌గా కదిరవన్‌, రాజన్న సిరిసిల్ల అడిషనల్‌ కలెక్టర్‌గా పి. గౌతమి, వనపర్తి అడిషనల్‌ కలెక్టర్‌గా సంచిత్‌ గంగ్వార్‌ లకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ క్రమంలో కేంద్రం నుంచి రాష్ట్ర సర్వీసులకు తిరిగొచ్చిన మహిళా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి డిసెంబర్ 15న హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.

Also Read: Animal Collections : 900 కోట్ల వైపు పరుగులు తీస్తున్న యానిమల్

  Last Updated: 17 Dec 2023, 04:52 PM IST