Site icon HashtagU Telugu

Telangana: అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తాం: మల్లు

Telangana

New Web Story Copy 2023 08 02t180233.200

Telangana: తెలంగాణ కాంగ్రెస్ లో రాబోయే రోజుల్లో భారీగా చేరికలు జరుగుతాయని జోస్యం చెప్పారు తెలంగాణ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో భారీగా చేరికలు జరిగాయన్నారు. దానికి కారణం ఏంటంటే.. బీఆర్ఎస్ లీడర్లు బీఆర్ఎస్ నుండి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లాలా అని అనుకుంటున్నారని, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో చేరికలు జరుగుతున్నట్టు చెప్పారు మల్లు భట్టివిక్రమార్క. వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్ లో చేరబోతున్నారనే సమాచారం తన వద్దకు రాలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా గురువారం నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని నిలదీస్తామని అన్నారు. పలు అంశాలపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ని ప్రశ్నిస్తామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా నీళ్లు, నిధులు, నియామకాలు అమలు కాలేదని స్పష్టం చేశారు మల్లు భట్టివిక్రమార్క.

Also Read: Delmont: దారుణం.. చిన్నారిని దత్తత తీసుకున్న దంపతులు.. చివరికి అలా?