“వేల గొంతులు లక్ష డప్పులు”మహా ప్రదర్శనను విజయవంతం చేయడం కోసం MRPS అధినేత శ్రీ మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ఈరోజు చిత్రసీమలో పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ(SC Vargikarana)ను అమలులోకి తీసుకొచ్చుకోవడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతి పెద్ద సాంస్కృతిక పోరాటమైన ” వేల గొంతులు – లక్షల డప్పులు ” (Vela Gonthulu – Lakshala Dappulu) కార్యక్రమంలో భాగస్వాములు కావాలని , ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రాచుర్యం పొందడానికి కావలసిన సహాయ సహకారాలు అందించాలని సినీ ప్రముఖులను మంద కృష్ణ మాదిగ కోరారు.
దీనిపై దర్శకులు స్పందిస్తూ ముప్పై ఏళ్లుగా ఒక లక్ష్యం కోసం నిలబడి రాజీలేకుండ మంద కృష్ణ మాదిగ పోరాటం చేయడం అనేది మామూలు విషయం కాదని, ఈ పోరాటంలో న్యాయం ధర్మం ఉంది కనుకనే ఇక్కడిదాకా రాగలిగారని , అందరికి న్యాయం జరగలనే లక్ష్యంతో జరుగుతున్న వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. దీనికి అన్ని విధాలుగా ఉద్యమానికి తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్బంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను అమలు చేయించేందుకు “వేల గొంతులు – లక్షల డప్పులు” పేరిట నిర్వహిస్తున్న సాంస్కృతిక పోరాటానికి దర్శకుల సహకారం అవసరమని వివరించారు. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాలంటే సినీ రంగానికి చెందిన ప్రముఖుల మద్దతు కీలకమని పేర్కొన్నారు. దర్శకులు ఈ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ సమావేశంలో అణగారిన వర్గాల ఆకాంక్షలు, సినిమా ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న మార్పులు, ఉద్యమానికి సంబంధించిన ఇతర అంశాలు చర్చకు వచ్చాయి. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సంఘీభావ సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పౌర సమాజం నుండి ప్రముఖులు, మెధావులు, ప్రొఫెసర్లు, రచయితలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పాల్గొనబోతున్నట్లు పేర్కొన్నారు.
శుక్రవారం జరిగిన సమావేశంలో దూమ్ దామ్ కన్వీనర్ అంతడుపుల నాగరాజు , ప్రజా వాగ్గేయకారులు దరువు ఎల్లన్న ,గేయ రచయిత పాటమ్మ రాంబాబు, ఓయు ఉద్యమ నేత నలిగంటి శరత్ , డిజిటల్ మీడియా స్టేట్ ఇంచార్జి సోమారపు మురళీకృష్ణ, MRPS రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Read Also : Duddilla Sridhar Babu : బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు