Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంగళవారం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మంచు విష్ణుపై ఆయన సోదరుడు మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు. తన సోదరుడు తాను ఇంట్లోలేని సమయంలో తన ఇల్లు ద్వంసం చేశాడని, తన కారుతోపాటు వస్తువులను సైతం దొంగిలించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Also Read: Pawan Kalyan: కుమారుడు హెల్త్ పై పవన్ కల్యాణ్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే?
మంచు ఫ్యామిలీ మరొకసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నార్సింగిలో మంచు విష్ణుపై తన సోదరుడు మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతోపాటు వస్తువులను దొంగిలించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. జల్ పల్లిలో ఇంటిలో కూడా 150మంది చొరబడి విధ్వంసం చేశారు. నా ఇంటిలో ఉన్న విలువైన వస్తువులతోపాటు కార్లను ఎత్తుకొని వెళ్లారు. నా ఇంటి నుంచి చోరీ అయిన కార్లు విష్ణు ఆఫీసులో లభ్యమయ్యాయి. నా ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకొని వెళ్లారు. ముఖ్యమైన వస్తువులన్నిటిని పగలకొట్టి విధ్వంసం చేశారు. నా కూతురు బర్త్ డే వేడుకలకోసం నేను రాజస్థాన్ కి వెళ్లగా నా సోదరుడు నా ఇల్లుని ధ్వంసం చేశాడు. నా ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. ఆయన మాట్లాడడానికి అందుబాటులోకి రాలేదని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
Also Read: Karregutta Vs Maoists : కర్రెగుట్టలపై ల్యాండ్ మైన్స్ వల.. మావోయిస్టుల సంచలన లేఖ.. ఏమిటీ గుట్టలు ?
గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో విష్ణు, మనోజ్‌ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మంచు మోహన్ బాబుసైతం మనోజ్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే, కొద్దిరోజులుగా వీరిమధ్య నెలకొన్న మనస్పర్థలు తొలిపోతున్నట్లు, త్వరలో వీరు కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ, తాజా పరిణామాలతో మంచు ఫ్యామిలీలో గొడవలు ఇప్పట్లో సర్థుకునేలా లేవని స్పష్టమవుతోంది. మంచు మనోజ్‌తో జరుగుతున్న గొడవలపై మంచు విష్ణు, మోహన్ బాబు పెద్దగా స్పందించకపోయినా వారి వల్ల తనకు చాలా నష్టం జరుగుతుందని మంచు మనోజ్ ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. తాజా పరిణామాలపై మంచు మోహన్‌బాబు, విష్ణులు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాల్సిందే.