Site icon HashtagU Telugu

Mallu Swarajyam: మల్లు స్వరాజ్యం ఇకలేరు!

Mallu Swrayam

Mallu Swrayam

తెలంగాణ సాయుధ పోరాటంలో తనవంతు పాత్ర పోషించిన యోధురాలు మల్లు స్వరాజ్యం (92) తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆమె కొన్నిరోజులుగా కేర్ ఆస్పత్రి వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. చికిత్స పొందుతున్న ఆమె శనివారం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల తెలంగాణ మేదావులు, రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సీపీఎం పార్టీ నుండి ఎమ్మెల్యే గానూ పనిచేశారు. మల్లు స్వరాజ్యం కుటుంబం మొత్తం చివరి వరకు పేద ప్రజల హక్కుల కోసం, ఎర్రజెండా పట్టి ప్రజా పోరాటాలకు ఊపిరి పోశారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా సీపీఎం కార్యదర్శిగా పని చేస్తున్న మల్లు నాగార్జున రెడ్డి ఆమె కుమారుడే కావడం విశేషం. ఆమె కోడలు మల్లు లక్ష్మీ కూడా సీపీఎం పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా పని చేస్తున్నారు.

మల్లు స్వరాజ్యం స్వగ్రామం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం. భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించించారు స్వరాజ్యం. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా ఆమె పోరాడారు. స్వరాజ్యం భర్త మల్లు వెంకట నర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. సోదరుడు దివంగత ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1978- 83, 1983- 84 వరకు రెండు సార్లు ఆమె ఎమ్మెల్యేగా పని చేశారు.

Exit mobile version