Malla Reddy: ఏపీ రాజకీయాలపై మల్లారెడ్డి హాట్ కామెంట్స్

తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చేసిన హాట్ కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ రోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ కార్మికశాఖ కార్యక్రమాన్ని నిర్వహించింది

Malla Reddy: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చేసిన హాట్ కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ రోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ కార్మికశాఖ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ… తెలంగాణాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కెసిఆర్, కేటీఆర్ లను ఇష్టంవచ్చినట్లు తిడుతున్నారని, కార్మికుల ఉసురు వారికి తగులుతుంది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. కార్మికుల కోసం కెసిఆర్ ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై హాట్ కామెంట్స్ కు పాల్పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎం కేసీఆర్ తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువగా నడుస్తాయని మల్లారెడ్డి ఆరోపించారు. ఇక ఏపీలో కెసిఆర్ చరిష్మా గురించి పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ స్ఫూర్తి తోనే కార్మికులు కాళేశ్వరం, యాదాద్రి, అంబేద్కర్, సచివాలయాన్ని కట్టారని చెప్పారు. హైదరాబాద్ లో కార్మికులకు మంచి రోజులు వస్తాయని మల్లారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ కేటగిరీలో కార్మికులకు అవార్డుల ప్రధానం చేశారు.

కాగా ఇటీవల కాలంలో తెలంగాణ నేతలు ఏపీ రాజకీయాలలో జోక్యం చేసుకుంటున్నారు. అక్కడ అభివృద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ మధ్య హరీష్ రావు ఏకంగా కార్మికుల్ని తెలంగాణాలో ఓటు హక్కు పొందాలని సూచించారు. కార్మికుల కోసం భవనాలు నిర్మిస్తామని, ఆంధ్ర కార్మికుల్ని తెలంగాణ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Read More: KCR First Meeting: సచివాలయంలో మొదటి సమీక్షా సమావేశం.. కీలక అంశాలపై కేసీఆర్ చర్చ!