Mallareddy : పార్టీ మార్పు పై మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

72 ఏళ్ల వయసులో తాను పార్టీ ఎందుకు మారుతాను? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్‌లో ఉన్నారన్నారు. తాము ఎటూ కాకుండా పోయామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌లో పోటీకి మా కుటుంబం నుంచి నలుగురం సిద్ధంగా ఉన్నామన్నారు.

Published By: HashtagU Telugu Desk
Malla Reddy key comments on party change

Malla Reddy key comments on party change

Mallareddy : తెలంగాణ పాలిటిక్స్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారుతారన్న చర్చ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే నిన్న సీఎం రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ కావడంతో ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారంపై మల్లారెడ్డి స్పందిస్తూ.. పార్టీ మారిన నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని కలిస్తే పార్టీ మారతారని ప్రచారం చేయడం తగదన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులతో పాటు మెడికల్, ఇంజినీరింగ్ సీట్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్‌ లో ఉన్న పనులను పూర్తి చేయించేందుకు సీఎంను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు.

Read Also: Vangaveeti Radha: ఫ్యూచర్‌ ప్లాన్.. వంగవీటి రాధ నిర్ణయం అదేనా ?

72 ఏళ్ల వయసులో తాను పార్టీ ఎందుకు మారుతాను? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్‌లో ఉన్నారన్నారు. తాము ఎటూ కాకుండా పోయామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌లో పోటీకి మా కుటుంబం నుంచి నలుగురం సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికలు వస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానన్నారు. MLAగా కంటే ఎంపీగా ఉండటమే తనకు ఇష్టమన్నారు. MLA పదవిలో మజా వస్తలేదన్నారు. జమిలీ ఎన్నికలు వస్తే తాను ఎంపీగానే పోటీ చేస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఇక, మల్లారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో పార్టీ మారుతున్నారనే ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడింది. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ, తన భవిష్యత్తు బీఆర్ఎస్ లోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా, మల్లారెడ్డి కుమార్తె భర్త, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం ఊపందుకుంది.

Read Also: Delimitation : కేంద్రానికి భారీగా చెల్లిస్తున్నా.. తిరిగి తక్కువ పొందుతున్నాం: సీఎం రేవంత్‌ రెడ్డి

 

 

  Last Updated: 22 Mar 2025, 03:06 PM IST