Malkajgiri BRS MP Candidate : మల్కాజ్‌గిరి నుంచి బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 09:24 PM IST

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ వరుస పెట్టి లోక్ సభ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. నిన్న బుధువారం నలుగుర్ని ప్రకటించిన కేసీఆర్..ఈరోజు మరో ఇద్దర్ని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్ (KCR)..లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికలతో సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ తరుణంలో గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మొదటి జాబితాలో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్‌ (ఎస్టీ రిజర్వ్‌) స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత, కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్‌) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించారు. నిన్న వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ , జహీరాబాద్‌ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ పార్లమెంటు స్థానానికి బాజిరెడ్డి గోవర్దన్‌ను ప్రకటించారు. ఈరోజు మరో ఇద్దరి పేర్లను ప్రకటించారు.

మల్కాజ్‌గిరి నుంచి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్రంలోని 17 స్థానాలకు ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ నుంచి నగేశ్ పోటీ చేసి గెలిచారు. అయితే ఈసారి టిక్కెట్ ఆత్రం సక్కుకు ఇస్తామని కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నగేశ్ బీజేపీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. దీంతో ఆత్రం సక్కుకు మార్గం మరింత క్లియర్ అయింది. మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు.

Read Also : Mamata Banerjee is Injured : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కి తీవ్ర గాయం..హాస్పటల్ లో చేరిక