Mahesh Kumar Goud took charge as the president of Telangana PCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రెటరీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. పదవీ బాధ్యతల అనంతరం మహేశ్ కుమార్ గౌడ్‍కు సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందలు తెలిపారు.
Read Also: Height: ఎత్తును బట్టి.. బరువు ఎంత ఉండాలో తెలుసా..?
కాగా, బాధ్యతల స్వీకరణకు ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి మహేశ్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. అక్కడి నుంచి గాంధీ భవన్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షితో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులకులతో పాటు తన నమ్మకం ఉంచి హైకమాండ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. దీంతో గత కొంతకాలంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎవరంటూ సాగిన ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది.