Mahesh Goud : తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలంగా పార్టీ లోపల తలెత్తుతున్న అసంతృప్తులపై స్పందించిన మహేష్ గౌడ్, పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని స్పష్టం చేశారు.
ఈనెలలోనే పీసీసీ కార్యవర్గం వర్గ విస్తరణతో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాలని హితవు పలికారు. “మీరు ఎలా పనిచేస్తున్నారో స్వయంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఈ అంశం ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాం” అని అన్నారు.
ప్రస్తుతం ప్రజలు ఆశలు పెట్టుకున్న నాయకులుగా నిలబడాలని, వారి సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని సూచించారు. పనితీరు మెరుగుపరచుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేలదేనని స్పష్టంగా తెలిపారు.
మహేష్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠను కలిగిస్తున్నాయి. త్వరలోనే కాంగ్రెస్ నేతృత్వం కార్యవర్గాన్ని కొత్తగా కూర్చే ప్రయత్నంలో ఉండగా, అవే ప్రక్రియలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోందన్న సంకేతాలు వస్తున్నాయి. దీంతో తమకు మంత్రిపదవి దక్కాలంటే తగిన పనితీరు అవసరమని మహేష్ గౌడ్ సూచనలతో స్పష్టమవుతోంది.
Starlink: అంబానీకి బాడ్ న్యూస్.. భారత్‌లో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌కు లైసెన్స్