Site icon HashtagU Telugu

Manne Srinivas Reddy : మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి

Mahabubnagar Brs Mp Candida

Mahabubnagar Brs Mp Candida

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ (BRS) కి భారీ షాక్ తగలడంతో..లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అధినేత కేసీఆర్ (KCR) చూస్తున్నారు. ఈ క్రమంలో గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా (Mahabubnagar BRS MP Candidate) మన్నె శ్రీనివాస్ రెడ్డి (Manne Srinivas Reddy) ని ఖరారు చేసారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్‌క‌ర్నూల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశ‌మై ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. 2019 ఎన్నిక‌ల్లో మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ త‌ర‌పున మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు ఎన్నికైన సంగ‌తి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ఇంకా నిర్ణ‌యించ‌లేద‌ని కేసీఆర్ తెలిపారు. ముఖ్యుల‌తో చ‌ర్చించి అభ్య‌ర్థిని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాన‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇక నిన్న క‌రీంన‌గ‌ర్ ఎంపీ అభ్య‌ర్థిగా వినోద్ కుమార్, పెద్ద‌ప‌ల్లి అభ్య‌ర్థిగా కొప్పుల ఈశ్వ‌ర్, ఖ‌మ్మం అభ్య‌ర్థిగా నామా నాగేశ్వ‌ర్ రావు, మ‌హబూబాబాద్ అభ్య‌ర్థిగా మాలోత్ క‌విత పేర్ల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి.

తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని, మరిన్ని అధిక లోక్‌సభ స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. అందుకే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తోంది. బీఆర్ఎస్‌కు ప్రతిష్ఠాత్మకం మహబూబ్‌నగర్ లోక్‌సభ. 2009 తరువాత ఎప్పుడూ ఓడిపోలేదు. 2009లో కేసీఆర్, 2014లో జితేందర్ రెడ్డి విజయం సాధించారు. 2019లో మన్నె శ్రీనివాసరెడ్డి విజయఢంకా మోగించారు. ఇక ఇప్పుడు మరోసారి ఆయనకే ఛాన్స్ ఇచ్చారు.

Read Also : BJP MP Upendra Singh : రాసలీలల వీడియో నాకు పంపించండి చూస్తాను – నటి కస్తూరి