బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుస దెబ్బలు ఎదురవుతున్నాయి. ఓ పక్క ఢిల్లీ లిక్కర్ కేసులో కూతురు (Kavitha) అరెస్ట్ అవ్వగా..ఇటు పార్టీ లో ఉన్న కొద్దీ మంది నేతలు కూడా కాంగ్రెస్ (COngress) గూటికి చేరుతుండడం తో అధినేత కేసీఆర్ కు ఏమాత్రం నిద్ర పట్టడం లేదు. ఎప్పుడు దూకుడు మీద ఉండే కేసీఆర్..ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే విజయ పతకం ఎగురువేశామో..లోక్ సభ ఎన్నికల్లో కూడా అలాగే విజయ పతకం ఎగురవేయాలని రేవంత్ చూస్తున్నాడు. అందుకే కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేశామని చెప్పి..ఇతర పార్టీ ల నేతలను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ నుండి ప్రతి రోజు వలసలు కొనసాగుతున్నాయి. కీలక నేతల దగ్గరి నుండి గల్లీ నేతలవరకు అంత కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా మహబూబ్ నగర్ జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి (Mahabubnagar ZP Chairperson Swarna Sudhakar Reddy) … ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఇటీవల పట్నం సునితా మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికి కూడా ఎంపీ టికెట్స్ ఖరారైనట్లు తెలుస్తుంది.
Read Also : RC 16 Pooja Ceremony: మొదలైన రామ్ చరణ్ కొత్త మూవీ పనులు.. వీడియోస్ వైరల్?