జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) (Maganti Gopinath) ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆయన మరణించారు. మాగంటి గోపీనాథ్ మరణవార్తతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
D4 Anti-Drone System: డీ4 యాంటీ-డ్రోన్ సిస్టమ్.. భారత్ నుంచి కొనుగోలుకు సిద్ధమైన తైవాన్!
మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవితాన్ని టీడీపీతో ప్రారంభించి, అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం (Jubilee Hills MLA) నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, తన నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలతో ఆయనకు బలమైన అనుబంధం ఏర్పడింది. ప్రజలతో సన్నిహితంగా మమేకమై, వారి సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించేందుకు ఆయన కృషి చేశారు.
Walk: భోజనం తర్వాత నడవాలా.. వద్దా? నిపుణుల సమాధానం ఇదే!
బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా మాగంటి గోపీనాథ్ కీలక బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని, బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణంతో బీఆర్ఎస్ పార్టీకి మరియు హైదరాబాద్ ప్రజలకు తీరని లోటు. పలువురు నాయకులు, ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.