‘లులు మాల్’ (Lulu Mall)..ఇప్పుడు హైదరాబాద్(Hyderabad) నగరం మొత్తం దీని గురించే మాట్లాడుకుంటున్నారు. గత నెల 27న కూకట్ పల్లిలో మంత్రి కేటీఆర్(KTR) చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. చిన్న వస్తువు దగ్గరి నుండి ఎంత పెద్ద వస్తువు వరకు..ఏదైనా ఇక్కడ అందుబాటులో ఉండడంతో నగరవాసులు వీటిని కొనేందుకు..ఈ మాల్ ను చూసేందుకు పోటీపడ్డారు. దీంతో మూడు రోజుల పాటు ఫుల్ గా ట్రాఫిక్ జాం అయ్యింది. హైటెక్ సిటీ నుంచి JNTU దగ్గరకు, మియాపుర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. సృజన మాల్ దగ్గర ఫ్లైఓవర్‌పై వాహనాలు నిలిపి మరి ‘లులు మాల్’ (Lulu Mall)ని సందర్శించడానికి వెళ్లారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ జనాలను చూసి యాజమాన్యం పంట పండిందో పో..అని తెగ సంబర పడ్డారు. కానీ అంత వెళ్ళిపోయాక కానీ అసలు సంగతి బయట పడాలె.
We’re now on WhatsApp. Click to Join.
మాల్ కు వచ్చిన జనాలు..ఎక్కడిక్కడే..ఏది కనిపిస్తే దానిని లూటీ చేశారట. మాల్ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నావాటిని ఏమాత్రం లెక్కచేయలేదు. అసలు కస్టమర్లు ఎవరు ఏం చేస్తున్నారనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. మాల్ ఉన్న వస్తువులు ఫుడ్ మొత్తాన్ని తిని పడేస్తూ వెళ్లిపోయారట. ఫుడ్డు తో పాటు కూల్ డ్రింక్స్ సీసాలు మొత్తం ఖాళీ చేసి పడేశారట. మాల్ మొత్తం ఖాళీ అయ్యిందట..గల్లా మాత్రం పైసలు లేకుండా ఖాళీగా కనిపించిందట..దీని చూసియాజమాన్యం విస్తు పోయింది. లులు మాల్ అంతా చెత్త కుండీలా చేశారట. ఎక్కడ చూసిన చాక్లట్ కవర్లు, ఫుడ్ కవర్లు, కూల్ డ్రింక్ తాగేసి ఖాలీ చేసిన బాటిల్లు దర్శనమివవ్వడంతో యజమాన్యం తలలు పట్టుకున్నారు. వామ్మో వీల్లు కస్టమర్లు కాదు.. ఇంతలా రాక్షసంగా ప్రవర్తించారేంటని షాక్ లో పడ్డారు. ఇప్పటికైనా ఫుల్ సెక్యూరిటీ పెట్టాలని, కస్టమర్లపై నిఘా పెట్టాలని పట్టిస్టంగా ఉండాలని గట్టి రూల్స్ పెట్టె పనిలో పడ్డారట మాల్ యాజమాన్యం.
Read Also : BMW X2 SUV: బీఎండబ్ల్యూ నుంచి మరో అదిరిపోయే కారు.. ఫీచర్లు ఇవే..!