Site icon HashtagU Telugu

Lok Sabha Elections 2024: ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు

Assembly Polls

Assembly Polls

Lok Sabha Elections 2024: రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ప్రధాన పార్టీల కీలక నేతలు జనంలోకి చేరుతున్నారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు . ఈసారి తమ పార్టీ 350కి పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా అవతరించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు.

తెలంగాణలో రేవంత్ సర్కార్ నిర్దేశిత లక్ష్యంతో ముందుకు సాగడం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టామన్నారు. ఈ రోజు అయోధ్యలో అయోధ్య రామమందిరం భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధే బీజేపీకి శ్రీరామ రక్ష అని విశ్వాసం వ్యక్తం చేశారు.

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వస్తున్నారని బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అంటున్నారు. ప్రధాని మోదీ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కిలో బియ్యం ఒక్క రూపాయికే వచ్చాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 10 సీట్లు గెలిచి ప్రధాని మోదీకి కానుకగా ఇవ్వాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read: Ayodhya – Bala Ramudu : బాల రాముడు ఎలాంటి అల్లరి, చిలిపి పనులు చేసాడో తెలుసా..?