CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ. 396.09 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏఎస్‌ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ..త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలనే ఎంపీటీసీలుగా, సర్పంచ్‌లుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల్లో నిజమైన పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగిందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అంతేకాక పార్టీ కోసం కష్టపడేవారికి పదవులు ఇవ్వాలన్నారు. వారికి ఇస్తేనే తాము ఇక్కడ కూర్చున్నామని వ్యాఖ్యానించారు. ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు చెప్పారు. సంవత్సరం లోపే మన ప్రభుత్వం ఎన్నో పనులు చేస్తుంటే… బీఆర్ఎస్ మాత్రం కుట్రలు చేస్తోందన్నారు.
Read Also: Pregnant: గర్భిణీ స్త్రీలను పాములు ఎందుకు కాటయ్యవో మీకు తెలుసా.?
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ఉసురు తగిలిందన్నారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారంటూ బీఆర్ఎస్ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను చేర్చుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలను హింసించారని… దాడులు జరిగిన సమయంలో కేసీఆర్ చెబుతున్న రాజనీతి ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. తన వరకు వస్తే గానీ కేసీఆర్‌కు బాధ తెలియడం లేదన్నారు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు.
Read Also: Doctor Sai Pallavi : డాక్టర్ పట్టా అందుకున్న సాయి పల్లవి