తెలంగాణ (Telangana ) రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) ఎప్పుడెప్పుడు జరుగుతాయా అనే ఆసక్తితో ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాయి. అయితే వివిధ కారణాలతో ఇప్పటివరకు ఎన్నికల తేదీలు ఖరారవ్వలేదు. తాజాగా తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలు జారీ చేస్తూ, సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాల్సిందే అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశముంది.
Blood Pressure: హైపర్‌టెన్షన్ ఎందుకు వస్తోంది? దీని వెనక ఉన్న కారణాలు ఏంటి?
ఈ ఎన్నికల్లో కీలక విజయాన్ని సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ప్రజల్లో విశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ప్రచారానికి సిద్ధమవుతోంది.
India- England Series: బెన్ డకెట్ శతకంతో భారత్‌పై ఇంగ్లాండ్ విజయం – 1-0తో సిరీస్‌లో ఆధిక్యం
ఇక ఎన్నికలతో సమానంగా ప్రతి గ్రామం, మండలం, జిల్లా రాజకీయంగా చురుకుదల చాటనున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు జరిగే క్రమంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనితీరు కేంద్ర బిందువుగా మారనున్నాయి. సెప్టెంబర్ 30 వరకు జరిగే ఈ ఎన్నికలలో ప్రభుత్వానికి మద్దతు ఉందా లేదా?, కాంగ్రెస్ పాలనపై ప్రజల తీర్పు ఏంటి? అనే విషయాలు స్పష్టతకు వస్తాయి. ఇకపోతే, ఎన్నికల కమిషన్ త్వరలో షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది.