తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా (Telangana) మద్యం సరఫరా (Liquor Supply) నిలిచిపోయింది. సర్వర్ ప్రాబ్లమ్ వల్ల సరఫరా ఆగిపోవడం తో మద్యం డిపోల నుంచి డీలర్లు లిక్కర్ తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాత్రిలోపు సర్వర్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం సరఫరా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు అనేవి అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా జరుగుతుందనే విషయం చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తుందంటే దానికి కారణం మద్యం అమ్మకాలే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే డబ్బుతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తుంటుంది. పండగ వేళలో, ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు భారీగా ఉంటాయి.
ఇదిలా ఉంటె త్వరలో మద్యం ధరలు పెరగబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎక్సైజ్‌శాఖ ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. లిక్కర్ ధరలు పెంచ్చొద్దన భావించినప్పటికీ సరిహద్దు రాష్ట్రాల్లో ధరలు పెరగడంతో ఇక్కడ కూడా ధరలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హార్డ్ మద్యంపై రూ.10 నుంచి రూ.90, బీరుపై రూ.15-20 పెంచేందుకు ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేస్తోంది. చీప్ లిక్కర్ బ్రాండ్లపై తక్కువ.. ప్రీమియం బ్రాండ్లపై ఎక్కువ రేట్లు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మద్యం ధరలు పెంచితే రాష్ట్ర ఖజానాకు నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో రోజుకు సరాసరిగా రూ.90 కోట్ల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. దీన్ని బట్టి నెలకు రూ.2700 కోట్ల నుంచి రూ.3000 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో ఆబ్కారీ శాఖకు రూ.17 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మిగిలిన 6 నెలల్లో కూడా ఇంతే స్థాయిలో ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.
Read Also : Allu Arjun Pushpa 2 : US లో పుష్ప 2 రికార్డులు మొదలు.. నెల ముందే ఎన్ని టికెట్లు తెగాయో తెలుసా..?