Liquor scam :ఈడీ ఆఫీస్ వ‌ద్ద 144 సెక్ష‌న్‌,క‌విత అరెస్ట్ త‌థ్యం?

లిక్క‌ర్ స్కామ్ లో (Liquor scam)ఎమ్మెల్సీ క‌విత‌ అరెస్ట్ కు రంగం సిద్ద‌మ‌యిందని వినిపిస్తోంది.

  • Written By:
  • Updated On - March 21, 2023 / 01:07 PM IST

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో (Liquor scam)ఎమ్మెల్సీ క‌విత‌(Kavitha) అరెస్ట్ కు రంగం సిద్ద‌మ‌యిందని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. సౌత్ గ్రూప్ లోని కీల‌క లిక్క‌ర్ లాబీయిస్ట్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో క‌లిపి విచార‌ణ        విచార‌ణ జ‌రుపుతార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే నిందితులుగా ఉన్న రామ‌చంద్ర పిళ్లై, క‌విత ఆడిట‌ర్ బుచ్చిబాబు, అమిత్ అరోరా, మాగుంట రాఘ‌వ త‌దిత‌రులు జుడీషియ‌ల్ క‌స్టడీలో ఉన్నారు. వాళ్ల‌తో క‌విత‌కు ఉన్న వ్యాపార సంబంధాల‌పై ఈడీ ఒక నిర్థార‌ణ‌కు వ‌చ్చింది. రెండుసార్లు విచారించిన క‌విత‌ను మూడోసారి మంగ‌ళ‌వారం కూడా రావాల‌ని ఈడీ స‌మ‌న్లు ఇచ్చిన విష‌యం విదిత‌మే.

ఎమ్మెల్సీ క‌విత‌ను అరెస్ట్ కు రంగం..(Liquor scam)

స‌మ‌న్లు ఇచ్చిన ప్ర‌కారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఈడీ ఆఫీస్ కు క‌విత (Kavitha)వెళ్లారు. ఆ స‌మ‌యానికి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా చేరుకున్నారు. ఇద్ద‌ర్నీ క‌లిపి విచార‌ణ చేస్తార‌ని తెలిసింది. అంతేకాదు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా ప్ర‌స్తుతం జుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్నారు. ఆయ‌న‌తో క‌లిసి కూడా క‌విత‌ను విచారించే అకాశం ఉంది. సౌత్ గ్రూప్ ను(Liquor scam) ఒక చోటకు చేర్చ‌డం ద్వారా విచార‌ణ‌ను ఫైన‌ల్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. అందుకే, ఈడీ ఆఫీస్ ఎదుట 144 సెక్ష‌న్ అమ‌లులోకి ఉంద‌ని తెలియ‌చేస్తూ ఢిల్లీ పోలీసులు బ్యాన‌ర్లు క‌ట్టారు. అంతేకాదు, క‌విత‌ను వ‌రుస‌గా రెండో రోజు ఈడీ ఆఫీస్ కు తీసుకెళ్లిన ఆమె భ‌ర్త విచార వ‌ద‌నంతో క‌నిపించారు. సోమ‌వారం మాదిరిగా క‌విత‌లో ఈడీ ఆఫీస్ లోప‌ల‌కు వెళ్లే ముందు జోష్ క‌నిపించ‌లేదు. ఇలాంటి సంకేతాల‌ను గ‌మ‌నిస్తే, మంగ‌ళ‌వారం క‌విత‌ను అరెస్ట్ చేస్తార‌ని భావించ‌డానికి అవ‌కాశం ఉంది.

రెండు బ్యాగుల్లో ఉన్న ఫోన్లను చూపించిన కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణం(Liquor scam) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత(Kavitha) మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. ఆమె భర్త వెంట రాగా ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఇక ఈడీ విచారణకు బయలుదేరేముందు కవిత పాత ఫోన్లను ప్రదర్శించారు. మొత్తం రెండు బ్యాగుల్లో ఉన్న ఫోన్లను చూపించిన ఆమె, మీడియాతో ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే వెళ్లిపోయారు. ఫోన్లు ధ్వంసం చేసినట్టు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ క్ర‌మంలో విచారణకు ముందు కవిత ఫోన్లను ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ ఈడీ అధికారులు కవితను రెండుమార్లు విచారించారు. సోమ‌వారం ఏకంగా పది గంటలకు పైగా విచారించారు.

ఈడీ ఆఫీస్ ఎదుట 144 సెక్ష‌న్

ఢిల్లీ లిక్కర్ స్కామ్(Liquor scam) లో కవితన సుదీర్ఘ విచారణ చేసిన ఈడీ సోమ‌వారం రాత్రి 9.15 గంటలకు వదిలింది. విచారించిన తరువాత వాగ్మూలం తీసుకొని బయటకు పంపారు. అక్కడే ఉన్న బీ ఆర్ ఎస్ శ్రేణులు రెండోసారి ఊపిరి పీల్చు కున్నాయి.రామచంద్ర పిళ్ళై తో కలిపి కవితను విచారించారని తెలుస్తుంది. ఆ తరువాత సిసోడియా, అమిత్ తో కలిపి విచారణ చేసి రికార్డ్ చేసినట్టు సమాచారం. మొత్తంగా రాత పూర్వక ఆధారాలను సేకరించిన తరువాత కవితను(Kavitha) సోమ‌వారం రాత్రి బయటకు పంపారు. వెంట‌నే, మంగ‌ళ‌వారం మ‌రోసారి విచార‌ణ‌కు రావాల‌ని స‌మ‌న్లు జారీ చేశారు. ఆ సంద‌ర్భంగా ఈడీ ఆఫీస్ నుంచి అన‌ధికారికంగా అందిన స‌మాచారం మేర‌కు మంగ‌ళ‌వారం క‌విత అరెస్ట్ ఉంటుంద‌ని తెలుస్తోంది.

Also Read : Kavitha Phones: లిక్కర్ స్కామ్ లో ట్విస్ట్.. ఫోన్లతో విచారణకు వెళ్లిన కవిత!

కవిత లాయర్లను విజిటర్స్ రూంకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. బీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఢిల్లీలో ఉన్నారు. ఈడీ ఆఫీస్ గేటు దగ్గరే ఇతర నేతలు అందర్నీ నిలిపివేశారు. కవిత (Kavitha) లాయర్ ను కూడా అనుమతించలేదు. కేవలం కవిత మాత్రమే ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. ఈడీ విచారణను సవాల్ చేస్తూ ఇప్పటికే కవిత సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ పెండింగ్ లో ఉంద‌ని కార‌ణాన్ని చూపుతూ మార్చి 16వ తేదీన విచారణకు హాజరుకాలేదు. తన న్యాయవాది ద్వారా ఈడీ కోరిన సమాచారాన్ని పంపారు. దీంతో 20వ తేదీన మళ్లీ హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన ప్ర‌కారం సోమ‌వారం విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

 Also Read : BRS-YCP :కోర్టుల్లో అవినాష్,క‌విత‌కి షాక్ !ఇక అరెస్ట్ త‌థ్య‌మా?

మంత్రి కేటీఆర్ ఆదివారం నుంచి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ లిక్క‌ర్ కేసుకు(Liquor scam) సంబంధించి తొలిసారి మార్చి 11న ఈడీ ముందు విచార‌ణ‌కు కవిత హాజ‌ర‌య్యారు. ఆ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు వెళ్లిన ఎమ్మెల్సీ క‌విత(Kavitha) రాత్రి 8.05 నిమిషాల‌కు తిరిగి వ‌చ్చారు. ఇదే స‌మ‌యంలో ఈడీ మార్చి 16న రావాలని నోటీసు ఇచ్చింది. కానీ ఆ రోజు హాజరవలేదు. దీంతో ఈడీ 20వ తేదీన హాజరవ్వాలని కవితకు మరోసారి నోటీసులు పంపింది. ఆమేరకు సోమవారం కవిత విచారణను ఎదుర్కొన్నారు.

సుప్రీం కోర్టులో ఈ నెల 24న విచారణ (Kavitha)

ఈడీ విచారణ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సాగుతోందని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ కవిత (Kavitha) దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో ఈ నెల 24న విచారణకు రానుంది. తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, ప్రివన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కేసుల్లో గతంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, విచారణ నుంచి మిన‍హాయింపు కోరుతూ కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ పిటిష‌న్ విచార‌ణ‌కు రాక‌ముందే క‌వితను మంగ‌ళ‌వారం అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని వినికిడి. హై టెన్ష‌న్ న‌డుమ మంగ‌ళ‌వారం విచార‌ణ కొన‌సాగుతోంది. ఈడీ ఆఫీస్ ప‌రిస‌ర ప్రాంతాల్లోనూ పోలీసులు భారీగా మోహ‌రించారు. అంతేకాదు, 144 సెక్ష‌న్ అమ‌లులో ఉంద‌ని ప్ర‌క‌టించ‌డంతో క‌విత అరెస్ట్ (Liquor scam)త‌థ్య‌మ‌ని అర్థ‌మ‌వుతోంది.

Also Read : BRS : తెలంగాణ ఏర్పాటు న‌గ్న‌స‌త్యాలు!BRS చీఫ్ నోట ఇలా.!!